లాభసాటి సాగుపై దృష్టిపెట్టాలి
లాభసాటి వ్యవసాయంపై రైతులు దృష్టి సారించాలని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి అన్నా రు
- వ్యవసాయ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి
వనపర్తి, డిసెంబర్ 24 (నమస్తే తెలంగాణ) : లాభసాటి వ్యవసాయంపై రైతులు దృష్టి సారించాలని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి అన్నా రు. పెద్దమందడి మండలం చిన్నమందడి గ్రామ రైతు శ్రీకాంత్‌రెడ్డి పొలంలో ప్రత్యామ్నాయ పంట గా వేసిన సీతాఫలం పండ్లను శనివారం వనపర్తి క్యాంపు కార్యాలయంలో మంత్రికి అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సంప్రదాయ సాగు నుంచి కర్షకులు బయటకు రావాలని సూచించారు. నూనె, పప్పు గింజలు, ఉద్యానవన పం టలతో రైతులకు అధిక ఆదాయం వస్తున్నదని చెప్పారు.
ఉద్యానవనశాఖ సబ్సిడీపై నాణ్యమైన కూరగాయల నారును అందించనున్నట్లు తెలిపారు. వ్యవసాయ, ఉద్యాన అధికారుల సలహాలు, సూచనలను రైతులు స్వీకరించాలన్నారు. ప్రతి ఐదు వేల ఎకరాలకు ఒక వ్యవసాయ అధికారి అందుబాటులో ఉన్నారని తెలిపారు. సీతాఫలం పండించిన రైతు శ్రీకాంత్‌రెడ్డిని మంత్రి అభినందించారు. మంత్రి ప్రోత్సాహంతో చిన్నమందడి గ్రామం లో 200 మంది రైతులు కూరగాయలు పండిస్తున్నారని రైతు తెలిపాడు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

