ధన్వాడ, మే 5 : ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలని బీఆర్ఎస్తోపాటు వివిధ పార్టీల నాయకులు ఆధ్వర్యంలో మంగళవారం ధన్వాడ మండలం మందిపల్లి స్టేజీ వద్ద రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ రైతులకు గన్నీ బ్యాగులు అందించడంలో ప్రజా ప్రభుత్వం విఫలం చెందిందని విమర్శించారు. ధాన్యం నిల్వచేసి 15 రోజులు గడుస్తున్నా గన్నీ బ్యాగులు లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. తూకం వెసినా ధాన్యం తరలించేందుకు లారీలు రాకపోవడంతో కల్లాలోనే రైతులు పడిగాపులు కాస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వం వెంటనే ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలని అదే విధంగా బోనస్ కూడా చెల్లించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మందిపల్లి సర్పంచ్ సురేందర్‌రెడ్డి, రామకృష్ణారెడ్డి, ఉదయభాను, రాం చంద్రయ్య, ఉమేశ్‌కుమార్, గోవర్ధన్‌గౌడ్, మల్లయ్య, శ్రీనివాస్‌గౌడ్, వెంకట్‌రెడ్డి, శివరాజ్, విష్ణువర్ధన్‌రెడ్డి, బీఆర్ఎస్, బీజేపీ నాయకులు, రైతులు పాల్గొన్నారు.
గన్నీ బ్యాగులు అందించాలి
మరికల్, మే 5: రైతులకు సరిపడా గన్నీ బ్యాగులు ఇవ్వకపోవడమే కాకుండా తూకం చేసిన వడ్లను తరలించకుండా తా త్సారం చేయడాన్ని నిరసిస్తూ రైతులు ఆం దోళన నిర్వహించారు. ఈ మేరకు మంగళవారం తాసీల్దార్ కార్యాలయంలో బీఆర్ఎస్ నాయకులతో కలిసి రైతులు డీటీ బీబీ హజ్రకు వినతిపత్రం అందజేశారు. అనంతరం బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వం రైతులను నిర్లక్ష్యం చేస్తున్నందని, అందులో భాగంగానే వారికి గన్నీ బ్యాగు లు అందించకుండా పంటలు మొత్తం వర్షానికి తడిసిపోతున్నా పట్టించుకోవడం లేదని ఆరోపించారు.
అధికారులు స్పందించి గన్నీ బ్యాగులు అందించడంతోపాటు తూకం చేసిన ధాన్యాన్ని వెంటనే తరలించి రైతులను ఆదుకోవాలని కోరారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు లంబాడి తిరుపతయ్య, కార్యదర్శి కృష్ణారెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ రవికుమార్‌యాదవ్, నాయకులు గూప నర్సిములు, విష్ణుకాంత్‌రెడ్డి, వెంకటేశ్ గౌడ్,నర్సిములు గౌడ్, ప్రవీణ్‌కుమార్, రాఘవేంద్ర, హన్మంతు, కృష్ణయ్య,వార్డుసభ్యులు శివకుమార్ , నర్సిహులు తదితరులు పాల్గొన్నారు.