అమరచింత, ఆగస్టు 17: కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో తాము ప్రభుత్వం ఏర్పాటు చేస్తే రూ.2లక్షల వరకు రైతులు తీసుకున్న పంటరుణాలుమాఫీ చేస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు అనేక షరతులు పెట్టి ఇబ్బందులకు గురి చేస్తుందని పలువురు రైతులు శనివారం రైతుకూలీ సంఘం ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని యూనియన్ బ్యాంకు ఎదుట ఆందోళన చేపట్టారు.
ఈ సందర్భంగా సంఘం నాయకుడు రాజన్న మాట్లాడుతూ.. ఏకకాలంలో రైతు రుణమాఫీ చేస్తామన్న ప్రభుత్వం మాట తప్పి మూడు విడుతలుగా రుణమాఫీ చేపట్టినా.. అందులో అనేక షరతులు పెట్టడంతో రూ.యాబై, లక్ష, రెండు లక్షల వరకు రుణాలను తీసుకున్న చాలామంది రైతులు మాఫీ వ ర్తించక ఆందోళన చెందుతున్నారని.., తక్షణమే షరతులను ఎత్తివేసి రైతులందరికీ మాఫీ చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం నాయకుడు ప్రసాద్, రైతులు కృష్ణారెడ్డి, ఆంజనేయులు, వాసరెడ్డి, అంజి, మహిళా రైతులు తదితరు లు పాల్గొ న్నారు.