కల్వకుర్తి, ఆగస్టు 14 : ఇచ్చే వాడికి తీసుకునేవా డు లోకువ అనే నానుడి బ్యాంకుల ముందు కష్టాలు పడుతున్న రైతులకు అతికినట్లు సరిపోతుంది. ప్రభు త్వం వ్యవసాయ రుణాలు మాఫీ చేస్తుందని తేదీలు ప్రకటించిన నాటినుంచి రైతులు తాము అప్పులు తీసుకున్న బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు. గందరగోళ పరిస్థితులు ఉండగా తమ రుణా లు మాఫీ అయ్యాయా.. లేదా అంటూ బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. రు ణమాఫీ అయిన వారు కొత్త రుణాల కోసం, రుణమాఫీ కానివారు ఎందుకు మాఫీ కాలేదని తెలుసుకునేందుకు, ప్ర భుత్వం రైతుబంధు ఇవ్వకపోవడంతో పెట్టుబడుల కోసం తాళిబొట్లను బ్యాంకుల్లో కు దువ పెట్టేందుకు రైతులు బ్యాంకుల వద్ద తచ్చాడుతున్నారు.
రైతులు ఉదయం 9గంటల వరకే బ్యాంకుల వద్దకు వచ్చి లైన్లో నిలబడుతున్నారు. పూర్తిస్థాయిలో రుణమాఫీ అమలై కొత్త రుణాలు రాక, పెట్టుబడి సా యం (రైతుబంధు) ఊసే లేక తీవ్ర ఇబ్బందులు ఎ దుర్కొంటున్న రైతులు తమ విధి రాతను నిందించుకుంటున్నారు. పాలిచ్చే బర్రెను వదులుకొని తన్నే దున్నపోతును తెచ్చుకున్నైట్లెందని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి రైతులు శాపనార్థాలు పెడుతున్నారు. గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చినట్లు రైతుబంధు ఇవ్వాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.