తాడూరు, ఆగస్టు 22 : ఎండిపోతున్న పంటలకు కేఎల్ఐ పరిధిలోని డీ-26 కాల్వ ద్వారా సాగునీరు విడుదల చేయాలని రైతులు డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం ఇరిగేషన్ కార్యాలయం ఎదుట పురుగుల మందు డబ్బాలతో రైతులు నిరసన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా రైతు లు మాట్లాడుతూ గత వారం రోజులుగా డీ-26కేఎల్ఐ కాల్వలో సాగునీరు తక్కువగా వస్తుండడంతో తాడూరు, గుం తకోడూరు, వెంకటాపూర్ గ్రామాలకు చెందిన పంటలకు సాగునీరు అందక ఎండిపోతున్నాయని, కాల్వకు సరిపడా నీరు విడుదల చేస్తే పంటలు బతికే అవకాశం ఉందన్నా రు. ఈ విషయాన్ని గత కొన్ని రోజులుగా అధికారుల దృష్టికి తీసుకువచ్చినా పట్టించుకోవడం లేదని అందుకే పురుగుల మం దు డబ్బాలతో నిరసన వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు. అనంతరం ఇరిగేషన్ శాఖ ఏఈ భరణ్కు వినతిపత్రం అందజేశారు.
ప్రధా న కాల్వ వద డీ-26కు నీరు విడుదలయ్యే తూము వద్ద ఇసుక బస్తాలు అడ్డుగా ఉండడంతోపాటు చెర్లఇటిక్యాల గ్రామ సమీపం లో కాల్వలో సిమెంట్ పైపులు అడ్డుగా ఉండడం మూలంగా నీరు తక్కువగా వ స్తుందంటూ రైతులు ఏఈ దృష్టికి తీసుకెళ్లగా ప్రస్తుతం ప్రధాన కాల్వలోనే నీటి ప్ర వాహం తక్కువగా ఉన్నందున సబ్ కెనాల్స్‌కు నీటి ఒత్తిడి తక్కువగా ఉందన్నారు. కాల్వలో ఉన్న ఇసుక బస్తాలు, సిమెంట్ పైపులను తొలగించి నీరు సరఫరా అయ్యే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు.