ఊటూర్, అక్టోబర్ 26 : ఆరుగాలం కష్టించి పం డించిన పత్తి పంటను కాటన్మిల్ యజమానులు నా ణ్యత, తేమ శాతం పేరుతో ధర తగ్గించి కొనుగోలు చే స్తున్నారని శనివారం మండలంలోని తిమ్మారెడ్డిపల్లి తండా మారుతీ కాటన్ ఇండస్ట్రీ వద్ద రైతులు ఆందోళన చేపట్టారు. జిల్లావ్యాప్తంగా వివిధ మండలాల నుంచి రైతులు పత్తిని ఇండస్ట్రీలో అమ్ముకునేందుకు శుక్రవారం సాయంత్రం నుంచి పెద్ద సంఖ్యలో వాహనాలతో తరలివచ్చి క్యూలో నిలిపారు. రాత్రి మొత్తం ఇండస్ట్రీ పరిసరాల్లోనే రైతులు నిద్రించారు. శనివారం ఉదయం 9గంటలకు కొనుగోలు ప్రారంభించిన వ్యాపారులు నాణ్యత, తేమ శాతం పరిశీలించి గరిష్ఠ ధర క్వింటాకు రూ.7,100 ప్రకటించారు.
దీంతో ఆగ్రహించిన రైతులు పేట-హైదరాబాద్ జాతీయ రహదారిపై బైఠాయించి ధర్నా నిర్వహించారు. వారం రోజుల నుంచి రూ.7,300 పలికిన పత్తి ధరను రైతులు పెద్ద మొత్తంలో తరలిరావడం చూసి తగ్గించడమేమిటని మిల్లు యజమానులను నిలదీశారు. వ్యాపారులు కు మ్మకై రైతులను దోపిడీ చేస్తున్నారని, అధికారులు ప ట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్ర భుత్వం మద్దతు ధరకు కొనుగోలు చేస్తామని చెప్పినా ఇప్పటివరకు జిల్లాలో ఏ ఒక మండలంలో కూడా సీసీఐ ద్వారా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయలేదని మండిపడ్డారు.
సగం అమ్మకాలు పూర్తయినా ఇప్పటికీ పట్టించుకోకపోవడంతోనే వ్యాపారులు రైతులను నిలువునా మోసం చేస్తున్నారని మండిపడ్డారు. ఎకరాకు రూ.40వేల వరకు పెట్టుబడి పెట్టామని, తే మ పేరుతో ఇష్టానుసారంగా ధరలను నిర్ణయిస్తూ నిం డా ముంచుతున్నారని వాపోయారు. గంటపాటు రై తులు నిరసన చేపట్టడంతో రోడ్డుకు ఇరువైపులా వా హనాల రాకపోకలు నిలిచి ప్రయాణికులు ఇబ్బందులకు గురయ్యారు. విషయం తెలుసుకున్న జిల్లా వ్యవసాయ అధికారి జాన్ సుధాకర్, నారాయణపేట సీఐ శివశంకర్ ఘటనా స్థలానికి చేరుకొని ఇండస్ట్రీ యజమానులు, రైతులతో మాట్లాడి ధర్నాను విరమింపజేశారు.
సోమవారం నుంచి జిల్లాలోని అన్ని కాటన్ ఇండస్ట్రీల వద్ద పత్తి కొనుగోలు చేపట్టేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ విషయమై ఇండస్ట్రీ యజమాని కిశోర్కుమార్ను ప్రశ్నించగా, అంతర్జాతీ య మారెట్లో బేల్ ధరలు తగ్గిపోవడంతో రైతులకు ఆశించిన ధరలు ఇవ్వలేకపోతున్నామన్నారు. మరోప క నాగర్కర్నూల్, వనపర్తి, మహబూబ్నగర్ జిల్లాల నుంచి రైతులు అమ్మకానికి రావడంతో ఒకేరోజు కొనుగోలు కష్టం అవుతుందని తెలిపారు.