ధన్వాడ, ఏప్రిల్ 26: వారం రోజుల నుంచి గన్నీ బ్యాగుల ఎప్పుడిస్తరని రైతులు కన్నెర్న చేశారు. సంచుల కోసం పీఏసీసీఎ స్ చుట్టూ తిరుగుతున్నా అధికారులు పట్టించుకోక పోవడంతో శనివారం వివిధ గ్రా మాల రైతులు ధన్వాడ సింగల్ విండో కా ర్యాలయాన్ని ముట్టడించారు. అధికారులు వచ్చే వరకు ఆందోళన చేపట్టారు.
నారాయణపేట అదనపు కలెక్టర్ బెన్షాలం రైతుల వద్దకు చేరుకొని రైతులకు సరిపడా గన్నీ బ్యాగులను అందిస్తామని హామీ ఇవ్వడం తో రైతులు ధర్నాను విరమించారు. ప్రతిరోజూ మూడు లారీల ధాన్యం పంపించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. అనంతరం ధన్వాడ, గోటూర్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. ధాన్యం కొనుగోలు ఎలా చేస్తున్నారని.. రికార్డులు సక్రమంగా లేకపోవడంపై విండో ఆధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంత ధా న్యం కొనుగోలు చేశారు.
ఎంత తరలించారనే విషయాలు రికార్డులో ఉంచాలన్నారు. సీరియల్ ప్రకారం రైస్ మిల్లులకు ధా న్యా న్ని తరలించాలని సూచించారు. కార్యక్రమంలో సివిల్ సప్లయ్ డీఎం సైదులు, తాసీల్దార్ సింధూజ, విండో చైర్మన్ వెంకట్రాంరెడ్డి, సీఈవో వెంకట్రాములు, ఏఈవో జైన్సింగ్, రైతులు మొగులప్ప, నర్సింహు లు, సిద్ధ్దు, రాజు, ప్రభాకర్, వెంకటమ్మ త దితరులు పాల్గొన్నారు.