కొడంగల్ : రైతుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సీఎం రేవంత్ రెడ్డి( CM Revanth ) కొడంగల్ నియోజకవర్గమైన ( Kodangal Constiuency ) దౌల్తాబాద్ మండలంలో రైతులు నిరసన తెలిపారు. తమ ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని కోరుతూ రహదారిపై బైటాయించారు. ఇదేమి రాజ్యం.. ఇదేమి రాజ్యం.. దొంగల రాజ్యం.. దోపిడి రాజ్యమంటూ నినాదాలు చేశారు.

ధాన్యం తూకం వేసి నెల రోజులైనా ధాన్యం తరలించకపోవడంతో రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ధాన్యానికి మొలకలు వస్తున్నాయని వాపోయారు. అధికారుల నిర్లక్ష్యం, ప్రభుత్వం వైఫల్యంతో చివరికి తామే ట్రాక్టర్లో లోడ్ చేసుకొని వెళ్తే అన్లోడ్ చేయక , వెయిటింగ్ ఛార్జీలు చెల్లిస్తున్నామని పేర్కొన్నారు. ధర్నా వల్ల ఇరువైపులా ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది.