అలంపూర్ చౌరస్తా, అక్టోబర్ 31 : ఒక వైపు వరుణుడి దెబ్బ కు అల్లాడిపోతూ ఆరుగాలం కష్టపడి పండించిన పత్తి పంట ను రైతులు అమ్ముకుందామన్నా ప్రభుత్వ నిబంధనలతో రైతులు కన్నీరు పెట్టుకునే దుసితి నెలకొన్నది. ఒక వైపు ప్రభుత్వ నింబంధనలు, మరో వైపు సీసీఐ అధికారుల ఇ ష్టానుసారంతో నడిగడ్డలో ఉన్న పత్తి రైతులు అల్లాడు తున్నారు. ఉండవెల్లి మండలం జాతీ య రహదారిపై ఉన్న శ్రీవరసిద్ధి వినాయక కాటన్ మిల్లుకి నాలుగు రోజులు కిం దట పత్తి వాహనాలు వచ్చాయి. అయితే వర్షం కారణంగా సీసీఐ అధికారులు కొనుగోలు చేయలేదు.
శుక్రవారం కొనుగోళ్లు ప్రారంభం కావడంతో వాహనాలు బారులు తీ రాయి. అయితే రైతు లు తెచ్చిన పత్తిలో తేమశాతం ఎక్కు వగా ఉందనే కారణంతో సీసీఐ అధికారులు వాహనాలను వెనక్కి పంపడంతో పత్తి రైతులు గగ్గోలు పెడుతున్నారు. జిల్లాలో కాటన్ మిల్ ఉండవెల్లి మండంలో ఒక్కటే ఉండ డంతో జిల్లా నుంచి నిత్యం వందల సంఖ్యలో వాహనాల్లో పత్తిని నింపుకొని మిల్లు దగ్గరకు వస్తే ఇక్కడ మాత్రం సీసీఐ అధికారులు తేమ శాతం ఎక్కువ ఉందని వాహనాలను వెనక్కి పంపడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వర్షం దెబ్బకు పంటలు పం డక లక్షల్లో అప్పులు చేసి పెట్టు బడు లు పెట్టి పండించిన పంటకు తేమ శాతం ఎక్కువ ఉంద ని వాహనాలు వెనక్కి పంపండం సరికాదని సీసీఐ అధి కారులపై రైతులు మండి పడ్డారు.
మీరు వ్యవసాయం చేస్తే మీకు మా బాధలు తెలుస్తాయని కూలీలు, ఎరువులు, రసాయన ఎరువుల పేరుతో పెట్టిన పెట్టుబడి మొ త్తం వారికే సరిపోతుందని రైతన్నలకు ఏం మిగులు తుం దని ప్రశ్నించారు. ఎకరాకు రూ.50 నుంచి రూ.60 వేలు పెట్టుబడులు పెట్టామని పంట కూడా అంతంత మాత్రమే వచ్చిందని వచ్చిన పంటను అమ్ముకుందా మంటే అధికారుల ఇష్టాను సారంగా వ్యవహ రిస్తున్నారని, ఇప్పుడు ఇక్కడ అమ్ముకో లేం. ఊర్లల్లో కూడా అమ్ముకోలేని పరిస్థితి నెలకొందని రైతులు ఆవేదన వ్యక్తంచేశారు. మూడ్రోజుల నుంచి వాహనాల్లో పత్తి తెచ్చి మిల్లు వద్ద పడిగాపులు కాస్తున్నా.. అధికారులు మాత్రం వాహనాలు వెనక్కి పంపండం సరికాదని వాపోయారు.