గద్వాల, అక్టోబర్ 2 : జోగుళాంబ గద్వాల జిల్లా లో రైతన్నకు సాగు కష్టాలు తప్పడం లేదు. ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని వ్యవసాయంపై ఆశ చావక.. లాభం వచ్చినా.. నష్టం చవిచూసినా.. పం టలు పండిస్తూనే పనులు చేపడుతూనే ఉం టాడు. కేసీఆర్ సర్కారు చేదోడు వాదోడుగా నిలవడంతో ఆసక్తి కనబరిచి సాగు చేపట్టారు. అయితే, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రైతన్న ఇక్కట్ల పాలవుతున్నాడు.
సరైన విద్యుత్ సౌకర్యం లేదు.. రైతు భరోసా అందలేదు.. పంటల బీమా పథకం ఏర్పాటు చేసేందుకు రైతు సంక్షేమ కమిషన్ ఏర్పా టు చేసినా.. అమలుకు నోచుకోకపోవడం, పంట నష్ట పరిహారం అందకపోవడంతో రైతన్నల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ప్రభుత్వం ఇస్తానన్న బోనస్ కూడా ఇవ్వకపోవడంతో రైతులకు ఏమి చేయాలో తోచడం లేదు. దీనికితోడు భారీ వర్షాలు కురియడంతో పంట అంతా నేలపాలైంది. వేల ఎకరాల్లో నష్టం వచ్చింది.
ఏటా సాగు ఖర్చులు పెరుగుతున్నాయి. కానీ ఇందుకనుగుణంగా ధరలు పెరగకపోవడంతో పెట్టుబడి కూడా చేతికి రావడం లేదు. కాలం కలిసి వస్తే తప్పా లాభాలు చూడడం లేదు. కేసీఆర్ సర్కారు హయాంలో పంట సీజన్ మొదలుకాగానే ఠంచన్‌గా రైతుబంధు డబ్బులు ఖాతాల్లో జమయ్యేవి. దీంతో పెట్టుబడికి ఎలాంటి ఇబ్బందుల్లేకుండా సాగు చేసేవారు.
సేద్యం ఖర్చు, విత్తనాలు, ఎరువులు, కూలీలకు ఇలా ఏదో రకంగా ఉపయోగపడేవి. అయితే, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రైతుభరోసా పేరిట రూ.7,500 ఇస్తామని చెప్పింది. కానీ, వానకాలం సీజన్ ముగుస్తున్నా ఇంతవరకు రూపా యి కూడా అందలేదు. దీంతో ఆసాముల వద్ద డబ్బులు వడ్డీలకు తెచ్చి సాగుచేయాల్సిన పరిస్థితి నెలకొన్నది. దీనికితోడు పెరిగిన సాగు ఖర్చులతో రైతులు బెంబేలెత్తున్నారు.