యాసంగికి సంసిద్ధం
వానకాలం పంటలు పూర్తిగా ముగియడంతో ఎన్నో ఆశలతో అన్నదాతలు యాసంగి వరి సాగుకు సన్నద్ధమవుతున్నారు. యాసంగి సాగులో రైతులు ఎకువగా దొడ్డు రకాల సాగువైపు మొగ్గు చూపుతున్నారు.
- నారుమడులు సిద్ధం చేస్తున్న రైతులు
- యాజమాన్య పద్ధతులు పాటించాలంటున్న వ్యవసాయాధికారులు
పెద్దమందడి, డిసెంబర్ 16 ; వానకాలం పంటలు పూర్తిగా ముగియడంతో ఎన్నో ఆశలతో అన్నదాతలు యాసంగి వరి సాగుకు సన్నద్ధమవుతున్నారు. యాసంగి సాగులో రైతులు ఎకువగా దొడ్డు రకాల సాగువైపు మొగ్గు చూపుతున్నారు. చలిప్రభావం నారుమళ్లపై పడకుండా ప్రత్యేక నారుమడి యాజమాన్య పద్ధతులు పాటించాలని వ్యవసాయాధికారులు సూచిస్తున్నారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితులు, నీటి లభ్యతను దృష్టిలో ఉంచుకొని స్వల్పకాలిక రకాలైన (120-130 రోజుల పంట కాలం) 1010, కేఎన్ఎం (118), ప్రైవేటు కంపెనీలోని స్వల్ప కాలం వంటి రకాలను సాగు చేసుకోవచ్చని చెబుతున్నారు. చలి ఉధృతిని బట్టి పంటకాలం 10 నుంచి 15 రోజుల వరకు పెరిగే అవకాశముంది. ముఖ్యంగా చలి ప్రభావం నారుమళ్లపై పడకుండా ప్రత్యేక నారుమడి యాజమాన్య పద్ధతులు పాటించాలని సూచిస్తున్నారు.
నారుమడిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు..
- రైతులు చలికి తట్టుకునే వరి వంగడాలను ఎంపిక చేసుకోవాలి.
- మండె కట్టిన విత్తనాలను వేయడం తప్పనిసరిగా అలవాటు చేసుకోవాలి.
- నారుపోసుకునే ముందు నారుమడికి సరిపడా సుమారు 2క్వింటాళ్లు బాగా మాగిన పశువుల ఎరువు లేదా కోళ్ల ఎరువు, కిలో జింక్ సల్ఫేట్ తప్పనిసరిగా వాడాలి.
- భాస్వరాన్ని రెట్టింపు మెతాదులో వేసుకోవాలి.
- రాత్రిపూట నారుమడిలో నీళ్లు లేకుంటే చలి ప్రభావం మొకలపై తగ్గుతుంది. కాబట్టి ప్రతిరోజూ వేకుమజామున, పగటిపూట నీటిని పెట్టి సాయంత్రం తీసివేయాలి.
- చలి తీవ్రత ఎకువగా ఉన్నప్పుడు నారుమడి చుట్టూ ఒక అడుగు ఎత్తులో పలుచని పాలిథిన్ షీట్ లేదా ఖాళీ ఎరువుల సంచులతో కుట్టిన పట్టాలను సాయంత్రం వేలలో కప్పి ఉదయం పూట తీసివేయాలి.
- రాత్రి ఉష్ణోగ్రతలు 10డిగ్రీల కంటే తగ్గినప్పుడు చలి తీవ్రత పెరిగి నారు ఎర్రబడడం, సరిగ్గా ఎదగకపోవడం పంట కాలం పెరిగిపోవడం, పోషకలోపాలు ముఖ్యంగా జింక్లోప లక్షణాలు కనిపించే అవకాశం ఉన్నది.
- ఈ జింక్ లోపం వల్ల ఆకులపై తుప్పుమచ్చలు ఏర్పడుతాయి. ఈ లోప నివారణకుగానూ లీటరు నీటికి 2గ్రాముల జింక్ సల్ఫేట్ కలిపి పిచికారీ చేసుకోవాలి.
- చలి తీవ్రత ఎకువగా ఉంటే స్వర్ణఫాల్ లేదా పార్ములా-4 వంటి సూక్ష్మపోషకాల మిశ్రమాన్ని 5రోజుల వ్యవధిలో రెండు సార్లు పిచికారీ చేసుకోవాలి.
- కాండం తొలిచే పురుగు బారి నుంచి నారును కాపాడుకునేందుకు, నారు తీయడానికి వారం రోజుల ముందు, 5సెంట్ల నారుమడికి 800గ్రాముల కార్బోఫ్యూరాన్ 3జీ గుళికలు వేయాలి.
- చలికి అగ్గితెగులు ఆశించే అవకాశం ఉంటుంది. ముందు జాగ్రత్తగా లీటరు నీటికి 0.6గ్రాముల ట్రైసైక్లోజోల్‌ను కలిపి పిచికారీ చేయాలి.
- రైతులు యాజమాన్య పద్ధతులను పాటిస్తే ఆరోగ్యవంతమైన నారు పెంచుకొని, తద్వారా అధిక దిగుబడులు సాధించవచ్చు.
నాణ్యమైన విత్తనాలు ఎంపిక చేసుకోవాలి..
రైతులు యాసంగిలో సాగు చేసే వారి విత్తనాలు ఎంపికలో నాణ్యమైన విత్తనాలను ఎంపిక చేసుకోవాలి. అదేవిధంగా మండే పెట్టేటప్పుడు చలి లేకుండా వరి విత్తనాలపై గడ్డి బాగా కప్పి పైన కవరు వేసుకుంటే మంచి మొలక వస్తుంది. నారుమడులు వ్యవసాయ అధికారుల సూచనలు పాటించి వేసుకోవాలి.
– కురుమయ్య, వ్యవసాయ అధికారి
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

