Srinivas Goud | కాంగ్రెస్ పాలనలో రైతుల పరిస్థితి దయనీయం : మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్
Srinivas Goud | కాంగ్రెస్ ప్రభుత్వ పాలన లో రైతుల పరిస్థితి మరింత దారుణంగా తయారయ్యిందని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు.
మహబూబ్ నగర్ : కాంగ్రెస్ ప్రభుత్వ పాలన ( Congress Rule) లో రైతుల పరిస్థితి మరింత దారుణంగా తయారయ్యిందని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ( Srinivas Goud ) ఆరోపించారు. మహబూబ్‌నగర్ జిల్లా మాచన్‌పల్లి లో ఎండిన పంటలను పరిశీలించారు.అనంతరం సబ్ స్టేషన్ వద్ద రైతులతో కలసి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలో దాదాపు రెండువందల ఎకరాల్లో పంటలు ఎండిపోయాయని పేర్కొన్నారు.
పంటలు నష్టపోయిన ప్రతి రైతుకూ ఎకరాకు రూ. 25 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం సక్రమంగా కరెంటు ఇవ్వకపోవడం వల్ల పంటలు ఎండిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. అప్పులు తీర్చేందుకు వలసలు పోయే పరిస్థితులు కల్పించారని పేర్కొన్నారు. కరెంటు ఉత్పత్తి చేసేందుకు బొగ్గు ఉన్నా కరెంటు ఉత్పత్తి చేయడం లేదని ఆరోపించారు.
తెలంగాణ నీళ్లను చంద్రబాబు కుప్పం నియోజకవర్గానికి తీసుకెళితే రేవంత్ రెడ్డి అందుకు సహకరించడం వల్ల మహబూబ్ నగర్‌లోని రిజర్వాయర్లలో నీళ్లు లేకుండా చేశారని విమర్శించారు. పాడి రైతులకు పశుగ్రాసం సబ్సిడీపై ఇవ్వాలని కోరారు. కాంగ్రెస్‌కు మోసం చేయడం తప్ప ఏమి తెలియదని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజేశ్వర్ గౌడ్, సీనియర్ నాయకులు మల్లు నర్సింహా రెడ్డి, రాజేశ్వర్ రెడ్డి, రాఘవేందర్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఆంజనేయులు, మండల పార్టీ అధ్యక్షులు దేవేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
North Korean Hackers: ఆ చోరీ వెనుక ఉన్నది నార్త్ కొరియా హ్యాకర్లే
Srinivas Goud | కాంగ్రెస్ పాలనలో రైతుల పరిస్థితి దయనీయం : మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్
‘కేసుల్లో కన్విక్షన్ శాతం పెంచేలా సమర్థవంతంగా పని చేయాలి’
అన్ని డివిజన్ల సమగ్ర అభివృద్ధే లక్ష్యం : నల్లగొండ మేయర్ బుర్రి చైతన్య
Patlolla karthik Reddy | డైరెక్టుగా గెజిట్ వచ్చింది.. సీఎంకు సంబంధం లేదంటే నమ్ముదామా..? : పట్లోళ్ల కార్తీక్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

