రాజోళి, జనవరి 27 : మండలంలోని పెద్ద ధన్వాడలో ఇథనాల్ ఫ్యాక్టరీ అనుమతులు రద్దు చేయాలంటూ 5వ రోజు నిరాహార దీక్షలు చేపట్టారు. మండలంలోని గ్రామాలకు చెందిన రైతులు మద్దతు తెలిపారు.
పెద్ద ధన్వాడలో ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తే మండలంలో పంటలు నాశనం అవుతాయన్నారు. పరిశ్రమ నుంచి వచ్చే వ్యర్థాల నుంచి ప్రజల ప్రాణాలకే ప్రమాదమన్నారు. ఫ్యాక్టరీ అనుమతులను రద్దు చేసే వరకు దీక్షలు కొనసాగుతాయని చెప్పారు.