జడ్చర్లటౌన్, ఆగస్టు 26 : రాష్ట్రంలో అసమర్థ ప్రభుత్వ పాలనతో రైతులు గోసపడుతున్నారని.. రైతులు అప్పులపాలై ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని మాజీ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి ఆరోపించారు. జడ్చర్ల మండలం ఈర్లపల్లి గ్రామ శివారులోని రణంగుట్ట తండాకు చెందిన రైతు విస్లావత్ రవినాయక్ అప్పులపాలై ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ గాంధీ మార్చురీ నుంచి రైతు రవినాయక్ మృతదేహం రాజాపూర్ మండలం ముదిరెడ్డిపల్లి చౌరస్తా వద్దకు చేరుకోగానే రైతు రవినాయక్ కుటుంబసభ్యులు, తండావాసులు ప్రభుత్వ నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ 44వ జాతీయరహదారిపై రవినాయక్ భౌతికకాయాన్ని ఉంచి ఆందోళనకు దిగారు.
వారికి జడ్చర్ల, రాజాపూర్ మండలాల బీఆర్ఎస్ నాయకులు సంఘీభావం ప్రకటించారు. కలెక్టర్ ఇక్కడికి రావాలని డిమాండ్ చేస్తూ వాహనాల రాకపోకలను స్థంభింపజేశారు. ఈ విషయాన్ని తెలుసుకున్న మాజీ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి అక్కడికి చేరుకొని రైతు కుటుంబాన్ని పరామర్శించారు. రైతు రవినాయక్ ఆత్మహత్యకు గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. రైతు కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ తరఫున రూ.50 వేలు ఆర్థిక సాయాన్ని అందజేశారు.
అనంతరం విలేకరులతో మాజీ మంత్రి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ రైతు రవినాయక్‌కు రెండున్నర ఎకరాల పొలం ఉండగా, గత ఏడాది రెండు బోర్లు వేసి అప్పుల పాలయ్యాడని, ఈ ఏడాది పత్తి పంట వేస్తే మొలకెత్తక చేసిన అప్పులు తీర్చలేక.. ఏం చేయాలో దిక్కుతోచక మనస్తాపంతో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడినట్లు చెప్పారు. పురుగుల మందు తాగిన రైతు రవినాయక్‌కు సకాలంలో జడ్చర్లలోని వంద పడకల దవాఖానలో చికిత్స అందించి ఉంటే బతికి బయటపడే అవకాశం ఉండేదన్నారు.
జడ్చర్లలో వంద పడకల దవాఖాన ట్రిట్మెంట్ అందక, జిల్లా దవాఖానకు పోతే అక్కడ ట్రీట్ మెంట్ చేయలేదు.. హైదరాబాద్ నిమ్స్‌కు పోతే అక్కడ ట్రీట్మెంట్ జరగలేదు. చివరకు గాంధీ దవాఖానకు వెళ్లే వరకు ప్రాణాలు పొగొట్టుకోవాల్సి వచ్చింది. ఓ వైపు రైతులు అప్పులపాలై ఆత్మహత్యానికి పాల్పడుతుంటే.. మరోవైపు ప్రభుత్వ దవాఖానలో చికిత్సలు అందక ప్రాణాలు పోయే పరిస్థితి దాపురించిందన్నారు. రైతు రవినాయక్ మరణానికి ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించి రైతు కుటుంబానికి రూ.50 లక్షలు ఆర్థిక సాయాన్ని అందించాలని డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో భయానక పరిస్థితి ఏర్పడిందని ఓ దిక్కు యూరియా కొరతతో యూరియా కోసం రైతులు ఇబ్బందులు పడుతున్నారు..యూరియా అందించలేని దద్దమ్మ ప్రభుత్వం కొనసాగుతుందని ఆరోపించారు. విత్తనాలు ఉండవు.. రైతుభరోసా ఇవ్వరు, నీళ్లు వస్తలేవు, కరెంటు సక్కగా ఉండదు.. అసమర్థ కాంగ్రెస్ సర్కారు పాలనలో మళ్లీ వ్యవసాయ రంగానికి పాతరోజులు వచ్చినవని చెప్పారు. కాంగ్రెస్‌ను తెచ్చుకుంటే మళ్లీ పాతరోజులు వస్తాయని ఆనాడే కేసీఆర్ చెప్పిండని..మళ్లీ యూరియా కోసం చెప్పులు లైన్లో పెట్టేరోజులు వచ్చాయన్నారు. ఇంత చేతగానీ దౌర్భా గ్య ప్రభుత్వాన్ని ఎన్నడూ చూడలేదన్నారు.
అసమర్థ ఎమ్మెల్యే.. అటుఇటుగానీ ఎమ్మెల్యే..
జడ్చర్ల నియోజకవర్గంలో చేతగానీ ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డికి అసమర్థత ఎమ్మెల్యే.. అటుఇటుగానీ ఎమ్మెల్యే అ ని బిరుదు ఇస్తున్నానని మాజీ మంత్రి లక్ష్మారెడ్డి చె ప్పారు. ముడా నిధుల గురించి సంతకం పెట్టిండం టూ చిల్లరమాటలు చెబుతూ జోకర్లా తిరుగుతు ండని విమర్శించారు. అటు ఇటుగానీ ఎమ్మెల్యేను గెలిపించుకుని ప్రజలు ఎటుగాకుండా అయ్యార న్నారు. వందపడకల దవాఖానలో స్టాఫ్‌ను తె చ్చుకోని అసమర్థ ఎమ్మెల్యే ఉన్నందుకే రైతు రవి ప్రాణాలు పోయాయని ఆరోపించారు. విమర్శలు చేయటం కంటే ము ందు ప్రజల కోసం పనిచేయి.. వందపడకల దవాఖానలో సిబ్బందిని తీసుకరా..? ఉదండాపూర్ నిర్వాసితులకు పరిహారం ఇప్పించు అని ఎమ్మె ల్యే అనిరుధ్ రెడ్డికి సూచించారు.