కొనుగోళ్ల జాప్యంపై రైతుల కన్నెర్ర
వరి ధాన్యం కొనుగోలు కేంద్రా లు ప్రారంభించి 15 రోజులు అవుతున్నా ఒక్క బస్తా తూకం చేయడం లేదని రైతులు కన్నెర్ర చేశారు. ఎర్రటి ఎండను సైతం లెక్క చేయకుండా తాండూరు, మహబూబ్ నగర్ రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో చేపట్టారు. వరి ధాన్యం బస్తాలను రోడ్డు పైకి తీసుకొచ్చి రోడ్డుకు అడ్డంగా వేసి ఖాళీ బస్తాలకు నిప్పంటించి ఆగ్రహం వ్యక్తం చేశారు.
- ధాన్యం కొనుగోలు చేయాలంటూ రాస్తారోకో
- ఖాళీ బస్తాలకు నిప్పంటించి నిరసన
- రోడ్డుకు ఇరువైపులా 2 కిలోమీటర్ల మేర నిలిచిపోయిన వాహనాలు
- మద్దతు తెలిపిన బీఆర్ఎస్ నేతలు
మహ్మదాబాద్, మే 4 : వరి ధాన్యం కొనుగోలు కేంద్రా లు ప్రారంభించి 15 రోజులు అవుతున్నా ఒక్క బస్తా తూకం చేయడం లేదని రైతులు కన్నెర్ర చేశారు. ఎర్రటి ఎండను సైతం లెక్క చేయకుండా తాండూరు, మహబూబ్ నగర్ రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో చేపట్టారు. వరి ధాన్యం బస్తాలను రోడ్డు పైకి తీసుకొచ్చి రోడ్డుకు అడ్డంగా వేసి ఖాళీ బస్తాలకు నిప్పంటించి ఆగ్రహం వ్యక్తం చేశారు. మండలకేంద్రంలో ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రంలో టన్నుల కొద్ది వరి ధాన్యం వచ్చి చేరినా వాటిని తూకం చేయకుండా అలాగే ఉంచడంతో రైతులు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు.
రైతుల ఆందోళనకు బీఆర్ఎస్, బీజేపీలు మద్దతు తెలిపి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు దిడ్డికాడి గోపాల్ మాట్లాడుతూ సన్న రకాలకు బోనస్ ఇవ్వాల్సి వస్తుందని దొడ్డు రకాలు వేయాలంటూ ప్రభుత్వం సూచించడంతో రైతులు దొడ్డురకాలు వేసి కేంద్రాలకు ధాన్యం తీసుకొస్తే దొడ్డు రకాలను కొనుగోలు చేయడానికి మిల్లర్లు ముందుకు రావడం లేదన్నారు. ప్రభుత్వం రైతుల జీవితాలతో చెలగాటమాడటం సరైంది కాదని త్వరలో రైతులే ప్రభుత్వానికి బుద్ధి చెబుతారన్నారు.
పోలీసులు వచ్చి ఎంత వారించినా రైతులు వినకుండా రోడ్డుపై బైఠాయించారు. కలెక్టర్ వచ్చి రైతుల సమస్యలు పరిష్కంచేంత వరకు కదిలేది లేదని భీష్మించి కూర్చుకున్నారు. ఎర్రటి ఎండ ఎక్కువగా ఉండడంతో ప్రయాణికులు వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురి కావడంతో రైతులు శాంతించి తమ సమస్యకు పరిష్కారం చూపాలని తాసీల్దార్‌ను ఆశ్రయించారు. తాసీల్దార్ విద్యాసాగర్ రెడ్డి రైతులను, కొనుగోలు కేంద్రం నిర్వాహకులు , ఏపీఎంను పిలిపించి సమస్యపై చర్చించారు. ధాన్యం కొనుగోలు ప్రారంభిస్తామని హామీ ఇవ్వడంతో ధర్నాను విరమించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు రంగంపల్లి రాంరెడ్డి, చింతకింది కేశవులు, బీజేపీ నాయకులు తిరుపతిరెడ్డి, కుర్వ కృష్ణ ఆయా గ్రామాల రైతులు పాల్గొన్నారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Pakistan | పాకిస్తాన్, ఖైబర్ పఖ్తుంఖ్వాలో ఎమర్జెన్సీ.. పీటీఐ ప్రభుత్వం రద్దు.. సీఎం అరెస్ట్
Agriculture Admissions | వ్యవసాయ కోర్సుల్లో మిగిలిన సీట్లకు కౌన్సెలింగ్.. ఈ నెల 14 నుంచి ప్రారంభం
Kadapa DSP | కడప డీఎస్పీగా భవానీ భాధ్యతల స్వీకరణ
MLC Dasoju Shravan Kumar | ఈ ప్రభుత్వానికి ఎంప్లాయింట్ పాలసీనే లేదు : ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్
IndiGo Flight | ప్రయాణికుడి పవర్ బ్యాంకువల్ల ఇండిగో ఫ్లైట్‌లో మంటలు.. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

