కోస్గి, నవంబర్ 25 : కేసీఆర్ పాలనలో రైతు రాజులా బతికాడని, ఏ ఒక్క రైతు ఇబ్బందులు పడలేదని కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన కోస్గి పట్టణంలోని శివాజీ చౌరస్తాలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో మెరుపు ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే పట్నం హాజరై మాట్లాడుతూ గత పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో ఏ ఒక్క రైతు గన్నీ బ్యాగుల కోసం గానీ, తమ ధాన్యం అమ్ముకోడానికి ఇబ్బంది పడలేదని గుర్తు చేశా రు.
ఇక్కడి ప్రజ ల ఓట్లతో గెలిచి ఇక్క డ చెయ్యాల్సిన అభివృద్దిని తన బంధువులకు అనువుగా ఉ న్న మహేశ్వరం ప్రాంతంలో పెద్దపెద్ద స్టార్టరప్ కంపెనీలను తెచ్చి అక్కడి ప్రాంతంలో అభివృద్ధిని చేస్తూ కొడంగల్ ప్రజల నోట్లో మట్టి కొడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల పంటలు చేతి కొచ్చినా ఇప్పటి వరకు రైతులకు గన్నీ బ్యాగులు అందించలేదని అన్నా రు. నియోజకవర్గంలో చాలా గ్రామాల్లో ఇంకా దాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చెయ్యలేని దౌర్భాగ్య పరిస్థితిలో ప్రభుత్వం ఉందని ఆయన మండిపడ్డారు. పత్తికి మద్దతు ధర విషయంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు.
ఎనిమిది క్వింటాళ్ల పత్తిని మాత్రమే ప్ర భుత్వం కొంటుందని సీఎం రేవంత్‌రెడ్డి అనడం సిగ్గుచేటని అన్నారు. పదిహేను క్వింటాళ్ల పత్తి పండించిన రైతుల పత్తిలో ఏడు క్వింటాళ్లు ప్రభుత్వం కొంటే మిగ తా ఏనిమిది క్వింటాళ్ల పత్తిని ఎక్కడ అమ్ముకోవాలి, సీఎం ఇంటి దగ్గర ఉంచుకుంటాడా అని ఎద్దేవా చేశా రు. కొడంగల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభివృద్ధికి అడ్డుపడుతుందని సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడటం సిగ్గుచేటన్నారు. మేము అభివృద్ధికి అడ్డుపడడం లేదు రైతు ల పచ్చని పంటపొలాలలో విషపు నీరు పారుతుందంటే అడ్డుకుంటున్నాం. ఫార్మా పేరుతో రైతుల నోట్లో మట్టి కొడతామంటే మిమ్మల్ని తిప్పికొట్టాం.. అంతేకాని అభివృద్ధికి అడ్డుపడడం లేదన్నారు.
నిన్ను గెలిపించిన ప్రజలకు అంతగా చేయాలనుకుంటే కోస్గి మండల కేంద్రానికి మంజూరైన ఇంజినీరింగ్ కళాశాలను అక్కడే ఉంచాలని, కోడంగల్‌కు మంజూరైన మెడికల్ కళాశాలను అక్కడే ఉంచి ఆయా మండలాలను అభివృద్ధ్ది చే యాలన్నారు. అంతేకాని ఇలా చేతకాని హామీలతో గెలి చి ప్రజలను మభ్యపెట్టొద్దని అన్నారు. సిమెంట్ ఫ్యాక్టరీలు మాకిచ్చి మా ఇండ్లలో దుమ్ము పోసి మీ బంధువులు భూములు కొన్న దగ్గర మంచి అభివృద్ధి పనులు చేసుకుంటారా అని ప్రశ్నించారు. అమలు సాధ్యం కాని హామీలిచ్చి పాలన చేతకాక మా బీఆర్ఎస్ మీద విషం కక్కుతున్నావని ఆగ్రహం వ్యక్తం చేశారు.
అభివృద్ధి చేయాలనుకుంటే సీఎం కుర్చీలో ఉన్న నీవు మంచి మంచి కంపెనీలను కొడంగల్‌కు తీసుకొచ్చి యువతకు ఉపాధి చూపించాలని డిమాండ్ చేశారు. ధర్నా అనంతరం ఆయన ఓ అభిమాని కోరిక మేరకు ఆ దంపతుల బిడ్డ పుట్టిన రోజు సందర్భంగా అక్కడే కేక్ కట్ చేసి అ చిన్నారిని ఎత్తుకొని వారితో ఫొటో దిగారు. అయితే ధర్నాకు అనుమతి లేదని సీఐ అక్కడివచ్చి చెప్పగా ఈ సందర్భంగా ఎమ్మెల్యేతో పా టు బీఆర్ఎస్ నాయకులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. దౌల్తాబాద్ మండల మాజీ జెడ్పీటీసీ మహిపాల్ మాట్లాడుతూ ఒక్క కొడంగల్ నియోజకవర్గంలోనే రేవంత్ రా జ్యాంగం అమలవుతుందని ఆరోపించారు.
లగచర్లలో భూములను లాక్కుంటే మాజీ ఎమ్మెల్యే నరేందర్రెడ్డిపై అక్రమ కేసు పెట్టి జైల్లో వేసి పైశాచిక ఆనందం పొందారని కాంగ్రెస్ నాయకులను ఉద్దేశించి లగచర్ల రైతుల తరపున పోరాడిన నా యకుడు సురేశ్ అన్నారు. హైకోర్టు మంగళవారం తమకు అనుకూలంగా తీర్పు ఇచ్చిందని సురేశ్ తెలపడంతో అక్కడే ఉన్న రైతులు ఆనందంతో చప్పట్లు కొట్టా రు. కార్యక్రమంలో కొడంగల్ నాయకులు మధుయాదవ్, నర్మదకిష్టప్ప, సముద్రమ్మ, బొంరాస్‌పేట నాయకులు షేరి నారాయణరెడ్డి, చాంద్‌పాషా, గుండుమాల్ నాయకులు కృష్ణయ్యగౌడ్, పార్టీ అధ్యక్షుడు రవి, శరత్‌గౌడ్, షాహీద్, కొత్తపల్లి అధ్యక్షుడు మధుసూదన్‌రెడ్డి, మల్లేశ్, మ ద్దూర్ నాయకులు గోపాల్, బసిరెడ్డి, దౌల్తాబాద్ నాయకులు మాజీ సర్పంచ్ రమేశ్, కోస్గి మాజీ వైస్ ఎంపీపీ సాయిలు, వెంకటనర్సిములు, బెజ్జు నీల ప్ప, రుద్రప్ప, మోహన్‌గౌడ్, బుగ్గప్ప, కోనేరు సాయప్ప తదితరులు పాల్గొన్నారు.