అయిజ, ఏప్రిల్ 22 : మండలంలో గాలివాన బీభత్సం సృష్టించింది. మంగళవారం రాత్రి వాతావరణంలో ఒక్కసారిగా ఉరుము లు, మెరుపులతో గాలివాన మొదలైంది. చె ట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. చేతికొచ్చిన వరి పంట నేలవాలింది. మామిడి, కొబ్బరి చెట్లు విరిగిపడ్డాయి. మండలంలో 500 ఎకరాల్లోని వరికి నష్టం వాటిల్లింది. చిన్నతాండ్రపాడు శివారులో 50కిపైగా వివిధ రకాల చెట్లు నేలమట్టమయ్యాయి. గాలికి విద్యుత్ స్తంభా లు నేలకొరగడంతో విద్యుత్ సరఫరా నిలిచిం ది.
అలాగే నౌరోజీక్యాంప్లో గుడిసెల పెంకు లు, రేకులు గాలికి ఎగిరిపోయాయి. మామిడి తోటలో కాయలు రాలడంతోపాటు చెట్లు విరిగాయి. ఆయా గ్రామాల ప్రజలు, రైతులు ఇ బ్బందులకు గురయ్యారు. అలాగే మేడికొండ గ్రామ రైతు కుమ్మరి తిమ్మప్ప రెండెకరాల్లో అరటితోట సాగు చేసి పెట్టుబడి రూ.8 లక్షలు ఖ ర్చు చేశాడు. చేతికొచ్చే దశలో ప్రకృతి ప్రకోపానికి నేలకొరిగింది. దీంతో రైతు లబోదిబోమంటున్నాడు. అధికారులు పంటను పరిశీలించి, పరిహారం చెల్లించాలని రైతు విజ్ఞప్తి చేశాడు.
గట్టు, ఏప్రిల్ 22 : గట్టుతోపాటు పరిసర గ్రామాల్లో ఈదురుగాలులతో వర్షం కురవగా.. 45.8 మి.మీ.గా నమోదైంది. గుడిసెలు, రేకుల షెడ్లు నేలకొరిగాయి. చెట్లు, ట్రాన్స్ఫార్మర్లు, 34 దాకా విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. వరి పైర్లు నేలకొరగడంతో రైతులు ఆందోళన చెందారు.