మాగనూర్, ఏప్రిల్ 24 : మాగనూ ర్, కృష్ణ ఉమ్మడి మండలాల్లో ఏ ర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలకు గన్నీ బ్యాగుల కొరత ఏర్పడింది. దీంతో కొనుగోలు కేం ద్రాలకు ధాన్యం తీసుకొచ్చిన వారికి పడిగాపులు తప్పడం లేదని రైతులు ఆవేదన వ్య క్తం చేస్తున్నారు. ఉమ్మడి మాగనూరు మం డలంలో పీఏసీసీఎస్ ఆధ్వర్యంలో 10 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశా రు. వీటి పరిధిలో రైతులు పంటలు కోసి 20, 25 గడిచినా టొకెన్లు ఇచ్చి గన్నీ బ్యాగులు ఇ వ్వకపోవడంతో ప్రతి రోజూ వాటి కోసం రై తులు ఏఈవోల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఉమ్మడి మండలంలో ఇప్పటి వర కు కేవలం 25 శాతం గన్నీ బ్యాగులు మాత్ర మే అందించారని ఇంకా 75 శాతం అందించాల్సిన ఉందని రైతులు చెబుతున్నారు. అయితే ప్రస్తుతం అకాల వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో పంటలు కాపాడు కోవడం కూడా కష్టంగా మారిందని రైతులు వాపోతున్నారు. గురువారం మాగనూరు పీఏసీసీఎస్లో ఏ ర్పాటు చేసిన కొనుగోలు కేంద్రానికి వంద మంది రైతులు గన్నీ బ్యాగుల కోసం వెళ్లగా అందులో సగం మందికి కూడా గన్నీ బ్యా గులు ఇవ్వలేదు. అందులోనూ చాలా వరకు పాతవి, చినిగిపోయిన బ్యాగులే ఎక్కువగా ఉన్నాయని రైతులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
మాగనూరులోనే ఇలాంటి ప రిస్థితి ఉంటే ఇక మారుమూల ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో ఎలాంటి పరిస్థితి ఉందో అర్థం చేసుకోవ చ్చు. గతంలో కేసీఆర్ హయాంలో కొనుగోలు కేంద్రాలకు గన్నీ బ్యాగులు కొరత లేకుండా పంపించి రైతులను ఇబ్బందుల పాలు చేయకుండా ఆదుకున్నారని, కాంగ్రెస్ వచ్చిన తర్వాత రైతులకు అన్ని కష్టాలే వచ్చాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం, అధికారులు స్పందించి ఇబ్బందులు లేకుండా కొనుగోలు కేంద్రాలకు గన్నీ బ్యాగులను పంపించి వీలైనంత త్వరగా ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలని రైతులు కోరుతున్నారు.