రైతులు చీరలను పలు రకాలుగా వినియోగించుకుంటున్నారు. ఈ క్రమంలో బాతుల రక్షణ కోసం చీరలను ఏర్పాటు చేశారు. చలికాలం కావడంతోపాటు వన్యప్రాణుల నుంచి కా పాడేందుకుగానూ చీరలను చుట్టూ వలలాగా కట్టారు. బాతుల వద్దే రైతులు గుడారాలను ఏర్పాటు చేసుకొని అక్కడే జీవనం కొనసాగిస్తున్నారు. ఈ దృశ్యాలను జోగుళాంబ గద్వాల జిల్లా కొత్తపల్లి గ్రామ సమీపంలో ‘నమస్తే తెలంగాణ’ క్లిక్‌మనిపించింది.