అమరచింత/గద్వాల రూరల్/అయిజ/బిజినేపల్లి/ధరూర్, ఆగస్టు 26 : గత రెండు వారాలకుపైగా యూరియా కోసం రైతులు నిత్యం పీఏసీసీఎస్ల ఎదుట పడిగాపులు కాస్తున్నారు. మంగళవారం ఆత్మకూర్ పీఏసీసీఎస్కు మూడు వందల బస్తాల యూరియా, అలాగే అమరచింత రైతు ఆగ్రో సేవా కేంద్రానికి నాలుగు వందల యూరియా బస్తాలు రాగా ఆయా మండల వ్యవసాయ అధికారులు పోలీసుల సహకారంతో ప్రతి రైతుకు రెం డు బస్తాలు చొప్పున పంపిణీ చేశారు. అమరచింత ఆగ్రో సేవా కేం ద్రం వద్ద రైతు ల తెల్లవారు జామున 3 గం టలకు వచ్చి క్కడే పడుకొన్నా రు.
అయినా చాలా మందికి యూరియా దొరకక పోవడంతో రైతులు నిరాశతో వెనుదిరిగారు. గద్వాల జిల్లా కేంద్రంలోని పీఏసీసీఎస్ కార్యాలయం ఎదుట మంగళవారం తెల్లవారు జాము నుం డే మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన రైతులు బారులు తీశారు. కొందరు మహిళలు ఇంట్లో వంట కూడా చేయకుండా రావడంతో హోటల్ నుంచి తె చ్చుకొని క్యూలోనే నిలబడి భోజనాలు చేశారు. ధరూర్ మండలకేంద్రంలోని పీఏసీసీఎస్ వద్ద పాసు బుక్కులు, ఆధార్ జిరాక్స్ ప్రతాలు పెట్టి క్యూలో పెట్టి పడిగాపులు కా శారు.
పోలీసు బందోబస్తు మధ్య సిబ్బంది యూరి యా పంపిణీ చేయడంపై రైతులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. అయిజలో గత మూ డు రోజులుగా యూరియా సింగిల్ విండో కార్యాలయానికి చేరకపోవడంతో యూరి యా స్టాక్ లేదు అనే బోర్డు రైతులకు దర్శనమిస్తోంది. మంగళవారం మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన రైతులు యూరియా కోసం అయిజలోని సింగిల్ విండో కార్యాలయానికి తరలొచ్చారు. యూరియా లేదని తెలుసుకొని నిరాశతో వెనుదిరిగారు.
నాగర్కర్నూల్ జిల్లా బిజినేపల్లిలోని మన గ్రోమోర్, ఇతర ప్రైవేట్ దుకాణల వద్ద యూరి యా కోసం రైతులకు తిప్పలు తప్పలేదు. మండల మొత్తంలో కేవలం ఒకరిద్దరి వద్దనే యూరియా ఉండడంతో ఎక్కు వ సంఖ్యలో రైతులు రావడం వల్ల చిన్నపాటి తోపులాట చోటు చేసుకుంది. దీంతో నిర్వాహకులు దుకాణాన్ని మూసి వెళ్లిపోయారు. ఇతర దుకాణాల వద్ద ఒక్కపాస్పుస్తకానికి కేవలం ఒక బస్తా యూరియా మాత్రమే ఇవ్వడంతో చేసేది లేక గంటల తరబడి నిరీక్షించి ఇచ్చిన ఒక బస్తాను తీసుకెళ్లారు.