నేడు వ్యవసాయ మార్కెట్‌కు సెలవు
మహబూబ్‌నగర్ మార్కెట్ యార్డుకు మంగళవారం 27,035 బస్తాల వేరుశనగ బస్తాలు వచ్చాయి. అయితే వాటి విక్రయాలు ఆలస్యం కావడంతోపాటు సరుకు లిఫ్టింగ్ కూడా చేయలేదు. దీంతో గురువారం మార్కెట్ యార్డుకు సెలవు ప్రకటిస్తున్నట్లు మార్కెట్ చైర్పర్సన్ బెక్కరి అనిత బుధవారం ప్రకటనలో తెలిపారు. తిరిగి శుక్రవారం మార్కెట్లో క్రయవిక్రయాలు యథావిధిగా జరుగుతాయని పేర్కొన్నారు. ఈ విషయాన్ని రైతులు గమనించి మార్కెట్ సిబ్బందికి సహకరించాలని కోరారు.
పాలమూరు, జనవరి 29 : మహబూబ్‌నగర్ మార్కెట్ యార్డులో రైతులు బుధవారం కూడా వ్య వసాయ మార్కెట్ కార్యాలయాన్ని ముట్టడించి ఆం దోళన నిర్వహించారు. రైతులు గత రాత్రి మంగళవారం మార్కెట్ కమిటీ చైర్మన్ చెప్పిన ప్రకారం క్వింటాపై రూ.200ధర పెంచాలని కోరారు. వ్యాపారులు మాకు రూ.200పెంచితే మాపై భారం పడుతుందని చేతులెత్తేయడంతో రైతులు బుధవారం మ రోసారి వ్యవసాయ కార్యాలయాన్ని ముట్టడించి ఆందోళన నిర్వహించారు. విషయం తెలుకున్న పో లీసులు మార్కెట్ కార్యాలయానికి చేరుకొని ధర్నా విరమించాలని రైతులను విజ్ఞప్తి చేశారు.
ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ రైతులు వ్యాపారుల దగ్గర కొన్న ధాన్యం రూ.13వేల పైన పెట్టి కొనుగో లు చేస్తే నాణ్యమైనదని, పంటపండించిన తరువాత పంట ధాన్యం నాణ్యత లేదని వ్యాపారులు అం టుండడం ఏంటని మండిపడ్డారు. అన ంతరం చైర్పర్సన్, ఆర్డీవో, తాసీల్దార్, పోలీస్ అధికారులు వ్యాపారులు, రైతులతో సమావేశం నిర్వహించారు. రైతులు మాట్లాడుతూ చైర్పర్సన్ ఇచ్చిన మాట ప్ర కారం రైతులకు క్వింటాల్‌పై రూ. 200 మద్దతు ధర ను ఇవ్వాలని కోరారు. మార్కెట్ యార్డులో తగిన సదుపాయాలు లేక ఇబ్బందులు పడుతున్నామని, కనీసం తాగడానికి నీరు కూడా లేని పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. అదే వి ధం గా మార్కెట్ యార్డులో హమలీలు కూడా రైతులతో అసభ్యంగా వ్యవహరిస్తున్నారని అసహనం వ్య క్తం చేస్తున్నారు. ఇచ్చిన మాట ప్రకారం ధరను అమలు చే యకపోతే మళ్లీ నిరసనలు చే స్తామని తెలిపారు.
కనీస వసతులు లేవు..
పాలమూరు మార్కెట్ యార్డులో కనీస వసతులు కూడా లేవు. తాగడానికి నీళ్లు లేక పోవడంతో బయట హోటళ్ల నుంచి తెచ్చుకోవాల్సిన పరిస్థితి దాపురించింది. మార్కెట్‌యార్డులో విద్యుత్‌దీపాలు కూడా సక్రమంగా లేవు. రైతులతో హమాలీలు, మార్కెట్ సిబ్బంది దురుసుగా ప్రవర్తిస్తున్నారు. గత ప్రభుత్వం మార్కెట్ యార్డులో భోజనశాల ఏర్పాటు చేసినా రైతులు కష్టాలు తప్పట్లేవు. క్వింటాపై రూ.200 పెంచి ఇవ్వాలని మార్కెట్ చైర్పర్సన్ చెప్పినా వ్యాపారులు ఆమె మాటకు కూడా విలువ ఇవ్వడం లేదు.
– కిష్టప్ప, ఉలిగుండం, దామరగిద్ద మండలం, నారాయణపేట జిల్లా
పెట్టుబడి కూడా రావడం లేదు..
ఐదు ఎకరాల్లో పల్లి సాగు చేశాను. నేను విత్తనాల కోసం 4 క్వింటాళ్ల పలుకు కొనుగోలు చేయగా క్వింటాకు రూ.13 వేలు తీసుకున్నారు. మొత్తం పెట్టుబడి రూ.లక్షన్నర అయింది. అదే పల్లిని పండించి అమ్మడానికి పాలమూరు మార్కెట్ యార్డుకు తీసుకురాగా 33 క్వింటాళ్లు అయ్యాయి. ఇక్కడి వ్యాపారులు క్వింటాకు రూ.3,860 ఇస్తున్నారు. దీంతో కనీసం పంట పెట్టుడి కూడా వచ్చే పరిస్థితి లేదు. వ్యాపారులు మార్కెట్లో రైతులను నిలదోపిడీ చేస్తున్నారు.
– రాజు, నల్లవెల్లి, కోయిలకొండ మండలం, మహబూబ్‌నగర్ జిల్లా