బీఆర్ఎస్కు కార్యకర్తలే బలం
బీఆర్ఎస్ పార్టీకి కార్యకర్తలే బలం, బలగమని.. వారిని కంటికి రెప్పలా కాపాడుకుంటామని నిరంజన్‌రెడ్డి అన్నారు. మండలంలో ఇ టీవల మరణించిన రంగాపురం గ్రామానికి చెందిన బొజ్జన్న, శేఖర్, బూడిదపాడుకు చెంది న రాముడు కుటుంబాలకు బీఆర్ఎస్ తరఫున మంజూరైన రూ.2 లక్షల చొప్పున ప్రమాద బీ మా చెక్కులను అందజేశారు. కొత్తసూగూరు లో మృతి చెందిన కార్యకర్త రాజు కుటుంబాన్ని పరామర్శించి.. పిల్లల చదువులకు చేయూతనందిస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ దురాగతాలు, ప్రజా వ్యతిరేక చర్యలను ఎప్పటికప్పు డు ప్రజలకు వివరించాలని సూచించారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ముందు చూపుతోనే ఇ టు కార్యకర్తలకు బీమా సౌకర్యం, అటు రైతన్నలకు రైతుబంధు సాయం అందజేశారన్నా రు. కుటుంబ యజమాని దూరమైతే ఆ కు టుంబాన్ని ఆదుకొనేందుకే ఈ పథకాలు ఎం తో ఉపయోగపడతాయని తెలిపారు.
పెబ్బేరు, డిసెంబర్ 10 : ‘కాంగ్రెస్ ప్రభు త్వం మమ్మల్ని పట్టించుకోవడం లేదు.. అర్హత ఉన్నా ఆసరా పింఛన్లు ఇవ్వడం లేదు.. పెంచుతామన్న పింఛన్లు ఏడాదైనా ఇవ్వడం లేదు.. రేవంత్ సర్కారు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది’ అంటూ మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి వద్ద రైతులు, మహిళలు మొరపెట్టుకున్నారు. మండలంలోని పలు గ్రామాల్లో ఇటీవల మృతి చెందిన బీఆర్ఎస్ కార్యకర్తల కుటుంబాలను ఆయన పరామర్శించి పార్టీ బీమా చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా బూడిదపాడు, కొత్తసూగూరు గ్రామాలకు చెందిన మహిళలు నిరంజన్‌రెడ్డి వద్దకు వెళ్లి వారి ఆవేదన వెల్లగక్కారు. అర్హత ఉన్నా పింఛన్లు రావడం లేదని, ఏడాదైనా పెరిగిన పింఛన్లు ఇవ్వడం లేదని.. కాంగ్రెస్ పట్టించుకోవడం లేదని వాపోయారు. మాఫీ కేవలం ప్రకటనలకే పరిమితమైందని, అమలులో లేదని, కేవలం రూ.లక్షలోపు వారికే రుణాలను మాఫీ చేశారని ఆరోపించారు.
అలా గే సూగూరులో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని నిరంజన్‌రెడ్డి పరిశీలించగా.. అక్కడే ఉన్న రైతు లు కొనుగోళ్లు సక్రమంగా జరగడం లేదన్నారు. వారం రోజులైనా వడ్లు కొనడం లేదని, బోనస్ మాటే ఎత్తడం లేదని, రైతు భరోసా ఇంకెప్పుడని ప్రభుత్వ తీరును ఎండగట్టారు. కేసీఆర్ ప్రభుత్వంలో అమలు చేసిన పథకాలను వారు గుర్తుకు తెచ్చుకున్నారు. మంత్రిగా మీరున్న కాలంలో జిల్లాలో చేపట్టిన అభివృద్ధి పనులను వారు పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీకి తాము ఓ ట్లేసి నట్టేట మునిగిపోయామన్నారు. కార్యక్ర మంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు గట్టుయాదవ్, అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్, గొర్రెల పెంపకందార్ల మాజీ అధ్యక్షుడు కురుమూర్తి యాదవ్, జిల్లా మీడియా సెల్ కన్వీనర్ అశోక్, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రాములు, మున్సిపల్ చైర్పర్సన్ కరుణశ్రీ, వైస్ చైర్మన్ కర్రెస్వామి, మాజీ జెడ్పీటీసీ పద్మ, నాయకులు రమేశ్, వేణురెడ్డి, కృష్ణారెడ్డి, వెంకటేశ్, ఎల్లారె డ్డి, గోపిబాబు, మధు, వీరస్వామి, గిరి, కిశోర్‌రెడ్డి, గోవిందు ఉన్నారు.