జడ్చర్ల, మే 6 : బాదేపల్లి వ్యవసాయ మార్కెట్లో కొంతమంది ధాన్యానికి వ్యాపారులు టెం డర్లు వేయలేదని బాదేపల్లి వ్యవసాయ మార్కెట్ యార్డులో మంగళవారం రైతులు ఆందోళన చేపట్టారు. మార్కెట్‌కు అన్నిరకాల వ్యవసాయ ఉత్పత్తులు 10,205 క్వింటాళ్లు అమ్మకానికి వచ్చాయి. హంస, ఆర్ఎన్ఆర్ రకం ధాన్యం 5,600 క్వింటాళ్లు ఉన్నాయి. కొంత మంది రై తులకు సంబంధించిన ధాన్యం తేమశాతం, గింజ నాణ్యత లేదంటూ వ్యాపారులు టెండర్లు వేయలేదు. దీంతో రైతులు మార్కెట్ గేట్మూసి ఆందోళన చేపట్టారు.
ఆరుగాలం కష్టించి పండించిన పంటను మార్కెట్‌కు తీసుకొస్తే టెండర్లు వేయరా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. టెండర్లు వేసిన వాటికి కూడా మద్దతు ధర ఇ వ్వడం లేదని మండిపడ్డారు. క్వింటాకు రూ. 1,500 నుంచి రూ.1,700ల ధర మాత్రమే ఇస్తున్నారని, తేమశాతం పేరుతో ధరలు తగ్గించి మా పొట్ట కొడుతున్నారని వాపోయారు.
విష యం తెలుసుకున్న మార్కెట్ చైర్పర్సన్ జ్యోతి, మార్కెటింగ్‌శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ బాలామణి, మార్కెట్ కార్యదర్శి నవీన్, ఎస్సై మల్లేశ్, డీటీ మార్కెట్‌యార్డుకు చేరుకొని రైతులతో మాట్లాడి టెండర్లు వేయిస్తామని సముదాయించారు. అ నంతరం వ్యాపారులతో మాట్లాడి టెండర్లు వే యించారు. దాంతో గొడవ సద్దుమణిగింది. రై తులు ధాన్యాన్ని ఆరబెట్టి తీసుకొస్తే మంచి ధరలు వస్తాయని వ్యాపారులు చెబుతున్నారు.