మరికల్, జూన్ 1 : మండల కేంద్రంలో అక్రమంగా నిల్వ చేసిన నకిలీ పత్తి విత్తనాలను ఆదివారం నారాయణపేట జిల్లా టాస్క్ఫోర్స్ పోలీసులు, మరికల్ పోలీసులు సంయుక్తంగా దాడులు చేసి పట్టుకున్నారు.
ఈఘటనకు సంబంధించి మరికల్ ఎస్సై రాము కథనం మేరకు మరికల్ మండల కేంద్రానికి చెందిన శ్రీనివాసులు, ధన్వాడ మండలం హన్మాన్పల్లి గ్రామానికి చెందిన వెంకటయ్య మరికల్లో కుమ్మరివాడలో ఓ ఇంట్లో 100కిలోల నకిలీ పత్తి విత్తనాలు ఉంచి రైతులకు అమ్ముతున్నారనే సమాచారం మేరకు దాడులు నిర్వహించగా వారి వద్ద నకిలీ పత్తి విత్తనాలు లభ్యమైనట్లు తెలిపారు. విత్తనాలకు ఏవో రహమాన్ ఖాన్ పంచనామా నిర్వహించగా మరికల్ ఎస్సై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.