మల్దకల్, ఏప్రిల్ 16 : మండలంలోని కుర్తిరావుల చెర్వు గ్రామంలో నకిలీ విత్తనాలను పట్టుకున్నట్లు వ్యవసాయశాఖ అధికారులు, ఎస్సై నందికర్ తెలిపారు. ఈ మేరకు వివరా లిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన కురువ శ్రీను అలియాస్ రాజు వ్యక్తి తన వ్యవసాయ బావి వద్ద గల షెడ్డులో 1,275 కేజీల పత్తి వి త్తనాలను అక్రమంగా నిల్వ ఉంచినట్లు సమాచారం రావడంతో ఏవో రాజశేఖర్, ఎస్సై నందికర్ పోలీసు సిబ్బందితో బుధవారం దాడులు చేశారు.
షెడ్డులో విత్తనాలు దొరకడంతో ట్రాక్టర్లో పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి ద ర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఈ దాడుల్లో హెడ్ కానిస్టేబుల్ గోపాల్, కానిస్టేబుల్ నిరంజన్ ఉన్నారు.