భానుడి భగభగ
నాగర్‌కర్నూ ల్ జిల్లాలో ఎండలు దంచికొడుతున్నాయి. మే నెల ప్రారంభంలోనే ఎండల తీవ్రత ఎక్కువ కావడంతో ప్రజ లు విలవిల్లాడుతున్నారు. ఉదయం 8 గంట ల నుంచే భానుడి ప్రతాపానికి ప్రజ లు బయటకు రావాలంటే జంకుతున్నారు. ఎండవేడిని తట్టుకోలేక వృద్ధులు, పిల్లలు అవస్థలు పడుతున్నారు.
- నాగర్‌కర్నూల్‌జిల్లాలో దంచికొడుతున్న ఎండలు
- అత్యధికంగా తిమ్మాజిపేటలో 43.2 డిగ్రీల ఉష్ణోగ్రత
- నిర్మానుష్యంగా మారిన ప్రధాన రహదారులు
- ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరవుతున్న జనాలు
నాగర్‌కర్నూ ల్, మే 6 : నాగర్‌కర్నూ ల్ జిల్లాలో ఎండలు దంచికొడుతున్నాయి. మే నెల ప్రారంభంలోనే ఎండల తీవ్రత ఎక్కువ కావడంతో ప్రజ లు విలవిల్లాడుతున్నారు. ఉదయం 8 గంట ల నుంచే భానుడి ప్రతాపానికి ప్రజ లు బయటకు రావాలంటే జంకుతున్నారు. ఎండవేడిని తట్టుకోలేక వృద్ధులు, పిల్లలు అవస్థలు పడుతున్నారు. ఉక్కపోతతో ఇండ్ల లో ఉండలేక, బయటకు వెళ్లలేక బెంబేలెత్తిపోతున్నారు. బయటకు వెళితే వడగాలుల తాకిడికి గురయ్యే పరిస్థితులు ఉండడంతో అత్యవసరం పరిస్థితుల్లోనూ బయటకు వెళ్లాలంటే ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
ఎండ తీవ్రతకు గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణ ప్రాంతాలకు వచ్చే ప్రజల సంఖ్య తగ్గడంతో వ్యాపారాలు అంతంత మాత్రంగానే సాగుతున్నాయని వ్యాపారస్తులు వాపోతున్నారు. మధ్యాహ్నం సమయంలో జిల్లా కేంద్రంతో పాటు ఆయా మండల కేంద్రాల్లో ప్రధాన రహదారులు నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. మంగళవారం రాత్రి నుంచి బుధవారం ఉదయం వరకు జిల్లా వ్యాప్తంగా 15 మండలాల్లో 40.3 నుంచి 43.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. దీంతో వాతావరణ శాఖాధికారులు తిమ్మాజిపేట, లింగాల, వంగూరు, కల్వకుర్తి, తాడూరు, ఊర్కొండ, వెల్దండ, ఉప్పునుంతల, చారకొండ, పెంట్లవెల్లి, పెద్దకొత్తపల్లి, నాగర్‌కర్నూల్, బల్మూర్, తెలకపల్లి, కొల్లాపూర్, కోడేరు, అచ్చంపేట మండలాల్లో ని కొన్ని ప్రాం తాలకు ఆరెంజ్ అల ర్ట్ జారీ చేశారు. మిగతా ఐదు మం డలాల్లోనూ ఎల్లో అలెర్ట్ జారీ చేశారు.
ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకొని ప్రజలు అప్రమత్తంగా ఉం డాలని, తప్పనిసరైతేనే బయటకు రావాలని, వచ్చినా వేడిని తట్టుకునేలా గొడుగు లేదా టోపీలు ధరించాలని వైద్యులు సూచిస్తున్నారు. ముఖ్యంగా వదులైన దుస్తు లు లేదా నూలు వస్ర్తాలు ధరించాలని, ప్రతి ఒక్కరూ నీటిని ఎక్కువగా తీసుకోవాలని, చల్లదనానికి మజ్జిగ, శీతల పానీయాలు తీసుకోవాలని పేర్కొంటున్నారు. వడదెబ్బ లక్షణాలైన తలనొప్పి, తల తిరగడం వంటి లక్షణాలు ఉంటే వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలని సూచిస్తున్నారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
BRS AUSTRALIA | వెలుగు పత్రిక తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం : అనిల్ బైరెడ్డి
AP Muncipal Elections | ఈ నెల 28వ తేదీన ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలకు సెలవు!
Shakambari Devi | శాకాంబరీదేవిగా వేయిస్తంభాల రుద్రేశ్వరీదేవి దర్శనం
Harish Rao | రైతుకూలీల బిడ్డలు డాక్టర్లు కావడం గర్వకారణం : మాజీ మంత్రి హరీష్‌రావు
TGSRTC | పండుగ వేళ టికెట్ ఛార్జీల బాదుడు.. 2003 జీవో పేరుతో సమర్థించుకున్న టీజీఎస్ఆర్టీసీ!
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

