కేటీఆర్ రాకతో పార్టీ శ్రేణుల్లోజోష్
పరిగి నియోజకవర్గంలోని అన్ని మండలాల నుంచి వేలాదిగా కార్యకర్తలు స్వచ్ఛందంగా తరలిరావడంతో పరిగి పట్టణం గులాబీమయంగా మారింది. మాజీ మంత్రి కేటీఆర్ పరిగి వస్తున్నాడని తెలుసుకున్న కార్యకర్తలు నూతనోత్తేజంతో పరిగికి భారీగా తరలివెళ్లారు.
- పరిగి అవగాహన సదస్సుకు భారీగా తరలిన మహ్మదాబాద్, గండీడ్ బీఆర్ఎస్ కార్యకర్తలు
మహ్మదాబాద్/గండీడ్, జూన్ 26 : పరిగి నియోజకవర్గంలోని అన్ని మండలాల నుంచి వేలాదిగా కార్యకర్తలు స్వచ్ఛందంగా తరలిరావడంతో పరిగి పట్టణం గులాబీమయంగా మారింది. మాజీ మంత్రి కేటీఆర్ పరిగి వస్తున్నాడని తెలుసుకున్న కార్యకర్తలు నూతనోత్తేజంతో పరిగికి భారీగా తరలివెళ్లారు. రోడ్లవెంట భారీ ఫ్లెక్సీలు, బ్యానర్లు, జెండా లు ఏర్పాటు చేశారు. పరిగిలో మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రులు కేటీఆర్, సబితాఇంద్రారెడ్డి, కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి, వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ హాజరయ్యారు. ఈ అవగాహన కార్యక్రమంలో కేటీఆర్ ప్రసంగం ప్రారంభం కాగానే కార్యకర్తలో జోష్ పెరిగింది. ఈలలు, కేకలతో తమ ప్రియతమ నాయకుడికి ఘనంగా స్వాగతం పలికిన బీఆర్ఎస్ కార్యకర్తలు ఆయనతో సెల్ఫీలు దిగడానికి పోటీ పడ్డారు. ఆయనను కలవడానికి కార్యకర్తలు ఆత్రుతతో ఎదురుచూశారు. సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా అమలు చేయలేకపోయిందని విమర్శించారు. భూములు కోల్పోతున్న రైతులకు అండగా నిలవడానికి వెళ్తున్న పరిగి మాజీ ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డిని అరెస్టు చేయిస్తారా అని మండిపడ్డారు.
అధికారం ఎవరికి శాశ్వతం కాదని రాబోయేది మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వమేనని జోస్యం చెప్పారు. కార్యకర్తలను కంటికి రెప్పల కాపాడుకుంటామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కొప్పుల అనిల్‌రెడ్డి, ఉమ్మడి మండలం నుంచి మాజీ జెడ్పీటీసీ శ్రీనివాస్ రెడ్డి, ఉమ్మడి మండలాల బీఆర్ఎస్ అధ్యక్షులు పెంట్యానాయక్, దిడ్డికాడి గోపాల్, వెంకట్ రాంరెడ్డి, మం గంపేట్తండా మాజీ సర్పంచ్ గీతాపాండు, గోపాల్ రెడ్డి, రాజేశ్వర్, బాలవర్ధన్‌రెడ్డి, వెంకట్‌రెడ్డి, రాం రెడ్డి, వెంకటయ్య, అశోక్ రెడ్డి, చింతకింది కేశవులు, మోహన్‌రెడ్డి, రాంరెడ్డి, వెంటయ్య గౌడ్‌తోపాటు పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ranabaali | ట్రైలర్‌కి డుమ్మా కొట్టిన రష్మిక .. ప్రీ రిలీజ్ ఈవెంట్లో విజయ్ దేవరకొండతో కలిసి సందడి
Supreme Court: సుప్రీంకోర్టును రాజకీయాల్లోకి లాగొద్దు: సీజేఐ సూర్యకాంత్
కమీషన్ల సొమ్ము దాచుకునేందుకే ఎమ్మెల్యే కడియం విదేశీ యాత్రలు : తాటికొండ రాజయ్య
Cancer Prevention | క్యాన్సర్ నివారణ అంటే పొగ తాగడం, మద్యం మానేయడం కాదు.. వీటిని కూడా పాటించాలి..
Mini Cooper | ‘అన్నీ మా డాడి చూసుకుంటాడు’.. ముగ్గురి మృతికి కారణమైన యువకుడి తలపొగరు వ్యాఖ్య..?
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

