మహబూబ్‌నగర్ అర్బన్, జనవరి 27 : జిల్లా అభివృద్ధిలో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలని ఎక్సైజ్, క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో శుక్రవా రం ది డిస్ట్రిక్ట్ అడ్వకేట్స్ మ్యూచువల్ ఎయిడెడ్ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ మహబూబ్నగర్శాఖ క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మ హబూబ్నగర్ను అన్నివిధాలా అభివృద్ధి చే సేందుకు అహర్నిశలు కృషి చేస్తున్నట్లు తెలిపారు. కలిసికట్టుగా జిల్లాను సుందరంగా తీర్చిదిద్దుకుందామని పిలుపునిచ్చారు. త్వర లో కోర్టు నూతన భవన నిర్మాణ పనులను ప్రారంభిస్తామని తెలిపారు. కార్యక్రమంలో సీనియర్ న్యాయవాది ప్రతాప్‌కుమార్, సొ సైటీ అధ్యక్షుడు రవిప్రకాశ్, మొగులయ్య, పరందాములుగౌడ్, కాంతారెడ్డి, బ్రహ్మ య్య, రాధ, కృష్ణ, శ్రీధర్‌రావు, రవీంద్రనాయక్, కొండయ్య, మల్లికార్జున్ ఉన్నారు.
రోడ్డు ప్రమాదంలో రెండు కాళ్లను కోల్పో యి దీనస్థితిలో ఉన్న మహేశ్చారికి ప్రభుత్వపరంగా అండగా నిలుస్తామని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ భరోసానిచ్చారు. పాతపాలమూ రు దోబీఘాట్లో శుక్రవారం ఏర్పాటు చేసి న కంటివెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించి వెళ్తున్న మంత్రి.. దీనస్థితిలో ఉన్న దోబీఘాట్వాసి మహేశ్చారిని చూసి చలించిపోయా రు. అతడిని ఆప్యాయంగా పలుకరించి వివరాలను తెలుసుకున్నారు. రోడ్డు ప్రమాదం లో రెండు కాళ్లను కోల్పోయానని, తన తం డ్రి కూడా మరణించాడని ఆవేదన వెలిబుచ్చాడు. ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్న మహేశ్చారికి వెంటనే మూడు చక్రాల వాహనాన్ని అందజేయడంతోపాటు అతడి విద్యార్హత మేరకు ఉద్యోగం కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా అధికారులను మంత్రి ఆదేశించారు. కార్యక్రమంలో కౌన్సిలర్ తిరుపతమ్మ, బీఆర్ఎస్ నాయకులు నవకాంత్, కిశోర్, మోతీలాల్, పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు.