వెల్దండ : నాగర్ కర్నూల్ ( Nagar Kurnool ) జిల్లాలో ప్రారంభమైన 1వ తరగతి నుంచి 9వ తరగతి విద్యార్థుల సమ్మేటివ్ అసెస్మెంట్-2 పరీక్షలను సమర్ధవంతంగా నిర్వహించాలని జిల్లా విద్యాశాఖ అధికారి ఏ రమేష్ కుమార్ (DEO Ramesh Kumar) తెలిపారు. బుధవారం వెల్దండ మండలం పెద్దాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల , తుంకి బండ తండా ప్రాథమిక పాఠశాలలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు .
పాఠశాలల్లో నిర్వహిస్తున్న సమ్మేటీవ్ అసెస్మెంట్ ( Summit Assesment ) ఎస్ ఏ 2 పరీక్షలను డీఈవో పరిశీలించారు. వేసవిని దృష్టిలో ఉంచుకుని విద్యార్థులకు గాలి, వెలుతురు పుష్కలంగా ఉండేలా గదుల్లోనే ఏర్పాటు చేయాలని హెచ్ఎంలకు ఆదేశించారు. విద్యార్థులకు ఏర్పాటు చేసిన వసతులను ఆయన పరిశీలించారు.
పరీక్షల అనంతరం జవాబుపత్రాలను కూడా వెంటనే మూల్యాంకనం చేసి, ఏప్రిల్ 23న ఫలితాలు వెల్లడించాలని, అనంతరం తల్లిదండ్రుల సమావేశం ఏర్పాటు చేసి, ప్రోగ్రెస్ కార్డులు అందించాలని సూచించారు. డీఈవో వెంట జిల్లా టెస్ట్ బుక్ మేనేజర్ నరసింహులు, వెల్డండ మండల విద్యాధికారి చంద్రుడు నాయక్ ఉన్నారు.