Ravula Chandrashekar Reddy | కొత్తకోట : మాజీ ఎమ్మెల్యే, తెలంగాణ భవన్ ఇంచార్జ్, బీఆర్ఎస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రావుల చంద్రశేఖర్ రెడ్డి జన్మదిన వేడుకలు కానాయపల్లి గ్రామంలో బీఆర్ఎస్ నాయకులు, అభిమానులు ఘనంగా నిర్వహించారు. ముందుగా కానాయపల్లి స్టేజి దగ్గర బాణాసంచా కాల్చి సంబురాలు చేసుకున్నారు. అనంతరం కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు.
రావుల చంద్రశేఖర్ రెడ్డిపై అభిమానంతో ధనుష్ తన స్వంత ఖర్చులతో కొత్తకోట ప్రభుత్వ హాస్పిటల్లో రోగులకు బ్రెడ్, పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ వైస్ ఎంపీపీ వడ్డే శ్రీనివాసులు, మెడికల్ ఆఫీసర్ డాక్టర్ మంజుశ్రీ, డాక్టర్ శ్రావణి, యోగ ఇన్స్పెక్టర్ త్రివేణి, సూపర్ వైజర్ ప్రమీల, నక్కల శాంతన్న, శేఖర్ గౌడ్, రవీందర్ గౌడ్, హోటల్ రాజు, బక్క గోవర్ధన్, వాకిటి నర్సింహా, పెద్ద కుర్మయ్య, ఇశ్రాయిల్, కొత్త నర్సింహా, వడ్డే నాగరాజు, జంగిడి రాజు, డీకే లక్ష్మణ్, రవి, నాగన్న తదితరులు పాల్గొన్నారు.