Amarachinta | అమరచింత, ఏప్రిల్ 16 : రైల్వే ప్రమాదంలో మంగళవారం మృతి చెందిన భరత్ కుమార్ రెడ్డి కుటుంబ సభ్యులను బుధవారం మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన భరత్ కుమార్ రెడ్డి మృతదేహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం తల్లిదండ్రులు సురేందర్ రెడ్డి, శారదమ్మను పరామర్శించి ధైర్యం చెప్పారు.
ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ.. కుమారుడిని కోల్పోయిన శారదమ్మ సురేందర్ రెడ్డి దంపతులకు ఆ భగవంతుడు ధైర్యాన్ని ఇవ్వాలన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఎల్లవేళలా ఆ కుటుంబానికి అండదండగా ఉంటుందని చిట్టెం రామ్మోహన్ రెడ్డి ధైర్యం ఇచ్చారు. ఆయనతోపాటు అమరచింత మున్సిపల్ మాజీ చైర్మన్ మంగమ్మ, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ రాజు, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు నరసింహ గౌడ్, పలువురు మాజీ మున్సిపల్ కౌన్సిలర్లు, మాజీ సర్పంచులు, మాజీ ఎంపిటిసిలు, బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు ఉన్నారు.