లగచర్ల రైతుల అక్రమ జైలు నిర్బంధంపై బీఆర్ఎస్ భగ్గుమన్నది. వారిని అరెస్టు చేయడంతోపాటు థర్డ్ డిగ్రీ ప్రయోగించడం.. రైతు చేతులకు బేడీలు వేసిన కాంగ్రెస్ ప్రభుత్వ నిరంకుశ, అమానవీయ.. అణిచివేత విధానంపై ఆగ్రహం వ్యక్తమైంది. దీంతో మంగళవారం ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా నిరసనలు హోరెత్తాయి. ఊరూరా అంబేద్కర్ విగ్రహాలకు వినతులు వెల్లువెత్తాయి. మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, నారాయణపేట, వనపర్తి, జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రాల్లో గులాబీ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
ర్యాలీల జోరు కొనసాగింది. రేవంత్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ.. ప్రభుత్వ వైఖరిని నిలదీస్తూ నిరసన చేపట్టారు. పలువురు నేతలను పోలీసులు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లకు తరలించారు. పాలమూరులో మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్, భూత్పూరులో మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి పాల్గొన్నారు. పేద దళిత, గిరిజన రైతులు తరతరాలుగా సాగు చేసుకుంటున్న భూములను బలవంతంగా లాక్కొని ఫార్మా కంపెనీకి దోచిపెట్టే కుట్ర సాగుతున్నదని మండిపడ్డారు. రైతులపై నమోదు చేసిన కేసులను ఎత్తేసి వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఏడాది కాలంగా రైతులను, ప్రజలను మోసం చేస్తున్న సర్కారును అడుగడుగునా నిలదీయాలని
– నెట్వర్క్ మహబూబ్‌నగర్, డిసెంబర్ 17
మహబూబ్‌నగ ర్ అర్బన్, డిసెంబర్ 17 : ఫార్మా సెజ్‌కు తమ భూములు ఇవ్వమని చెప్పి న లగచర్ల రైతులపై అక్రమంగా కేసులు బనాయించి జైల్లో పెడతారా అని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ప్రశ్నించారు. భేషరతుగా ప్రభుత్వం రైతులపై పెట్టిన కేసులు ఎత్తివేసి విడుదల చేయాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ వ ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు లగచర్ల రైతులపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని కోరుతూ మంగళవారం జిల్లా కేం ద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో బీఆర్ఎస్ నాయకులతో కలిసి మా జీ మంత్రి నిరసన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా అం బేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. అనంతరం మాజీ మంత్రి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్ర భుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా.. ఉన్న హామీలను తుంగలో తొక్కి ప్ర శ్నించిన వారిని జైల్లో పెడుతున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఎస్సీ, ఎస్టీ ప్రజ ల భూములు గుంజుకోమని చెప్పి అధికారం చేపట్టాకా లగచర్ల ఎస్టీ పేద రైతుల భూములు గుంజుకొని మాట తప్పారన్నారు. తమ ప్రాణా లు పోయినా తమ భూములు ఇవ్వమని తేల్చి చెప్పినందుకు.. కలెక్టర్‌పై దాడి చేశారంటూ అక్రమంగా కేసులు బనాయించి జైల్లో పెట్టార ని ఆవేదన వ్యక్తం చేశారు. స్వయంగా కలెక్టర్ తనపై దాడి జరగలేదని చెప్పినా ఈ ప్రభుత్వం పట్టించుకోకుండా రైతులను విచారించాలని చె ప్పి జైలుకు పంపించారని ఆరోపించారు. రైతు లు ఎవరిపై దాడి చేశారని నలభై రోజులుగా బె యిల్ ఇవ్వకుండా జైల్లో పెట్టారని ప్రశ్నించా రు.
ఓ రైతుకు గుండెపోటు వస్తే టెర్రరిస్టులాగా బేడీలు వేసి దవాఖానకు తీసుకువచ్చి చికిత్సలు చేయిస్తారా? ఇలాంటి పద్ధతి దేశంలో ఎక్కడైనా ఉందా? అని అన్నారు. రా ష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రశ్నించిన వా రిపై దాడులకు పాల్పడుతున్నారని, నిలదీస్తే జైల్లో పెడుతున్నారని, ఇదేనా కాంగ్రెస్ చెప్పిన ప్రజాపాలన అంటే అని మండిపడ్డారు. హామీలను నెరవేర్చకుండా విజయోత్సవ సం బురాలను నిర్వహించుకోవడం శోచనీయమన్నారు. ప్రజలు తిరగబడక ముందే ప్రభుత్వం తమ విధానాలను మార్చుకోవాలని, లేదంటే ప్రజాగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించా రు. సీఎం సొంత నియోజకవర్గం అంటే జిల్లాతోపాటు రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలకు ఆదర్శంగా ఉండాలి. కానీ పేదల భూములు గుంజుకొని కంపెనీలు ఏర్పాటు చేస్తామని రై తులను ఇబ్బందులకు గురిచేస్తే వారితో కన్నీళ్లు పెట్టిస్తే అక్కడ ఆ కంపెనీ నిలుస్తుందా? అని ప్ర భుత్వాన్ని నిలదీశారు.
ఇప్పటికైనా ప్రభుత్వం తన వైఖరి మార్చుకొని రైతులపై పెట్టిన అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలని లేదంటే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పోరాటాన్ని మరింత ఉధృ తం చేస్తామని ప్రకటించారు. త్వరలోనే జమిలీ ఎన్నికలు రాబోతున్నాయని, అంతలోపే హా మీలను అమలు చేయాలన్నారు. కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావులను జైలుకు పంపుతాం అం టే కేసులకు భయపడేవారెవరూ లేరని హెచ్చరించారు. కార్యక్రమంలో గ్రంథాలయాల సం స్థ మాజీ చైర్మన్ రాజేశ్వర్‌గౌడ్, మున్సిపల్ మా జీ చైర్మన్ నర్సింహులు, ముడా మాజీ చైర్మన్ వెంకన్న, పట్టణ అధ్యక్షుడు శివరాజ్, నాయకు లు ఆంజనేయులు, కరుణకర్గౌడ్, దేవేందర్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, జంబులయ్య, సుధాకర్, పాలసత్తి, ఆకుల శివ, రమేశ్నాయ క్, కిషన్పవర్ తదితరులు పాల్గొన్నారు.