వనపర్తి, జూలై 30 (నమస్తే తెలంగాణ) : జిల్లా కేంద్రంతోపాటు నియోజకవర్గంలో అ ర్ధాంతరంగా నిలిచిన అభివృద్ధి పనులను వెంట నే చేపట్టాలని, కాల్వలకు నీళ్లివ్వడంతోపాటు చెరువులను నింపాలని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం కలెక్టర్ ఆదర్శ్ సురభిని కలిసి పెండింగ్‌లో ఉన్న ప నుల వివరాలతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి మాట్లాడుతూ గత ప్రభుత్వం చేపట్టిన అనేక పనులను కొనసాగించాలన్నారు.
రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని చేపట్టిన సాగునీటి పనుల ను ఎలాంటి మార్పులు లేకుండా కొనసాగించాలని, ఖిల్లాఘణపురం, బుద్ధారం చెరువుల ను ప్రత్యేక జీవో ద్వారా 3500 ఎకరాల నుంచి 5 వేల ఎకరాల ఆయకట్టుకు ఉపయోగపడే వి ధంగా ప్రతిపాదనలు చేసి పనులు చేపట్టడం జ రిగిందన్నారు. అయితే, ప్రస్తుత ప్రభుత్వంలో కొన్ని మార్పులు చేస్తూ పనులు కొనసాగిస్తున్నారని, దీనివల్ల వేలాది మంది రైతులు నష్టపోతారన్నారు.
ఇందుకోసం యథావిధిగా పను లు కొనసాగిస్తే రైతులకు ఎలాంటి నష్టం ఉండదన్నారు. మామిడిమాడ రిజర్వాయర్ పూర్తి చేయాలని, కర్నేతండా కాంట్రాక్టు ఏజెన్సీ ప్రతిపాదించిన విధంగా పనులు చేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. అలాగే రూ.50 కోట్లతో చే పట్టే రామన్నగుట్ట రిజర్వాయర్(డీ8.. ఎంజే 4) కాశీంనగర్, రేమొద్దుల, అంజనగిరి పరిధి లో పనులకు టెండర్ పిలవాలని కోరారు. బు ర్రవాగు చెక్‌డ్యాంలో భూములు కోల్పోయిన రైతులకు ప్రత్యామ్నాయంగా భూములు కేటాయించాలని, నాగవరం, రాజనగరం పరిధిలో ని భూములపై దేవాదాయశాఖ నిషేధిత జీవో ఎత్తివేయాలని కోరారు.
సవాయిగూడెం, నాచనహళ్లి మధ్యలో ఉన్న జమ్ములతండాకు అసంపూర్తిగా ఉన్న రోడ్డు పనులు పూర్తి చేయాలని, కేఎల్ఐ కెనాల్స్ ద్వారా నీటిని విడుదల చేసేందుకు చొరవ చూపాలని కలెక్టర్ సూచించారు. అలాగే జిల్లా కేంద్రంలో జేఎన్టీయూ ఇంజినీరింగ్ కళాశాల కోసం మొదటి విడుతలో 5 కో ట్లు, రెండో విడుతలో రూ.32 కోట్లు మంజూరై ఉన్నాయని, వీటి పనులను వెంటనే చేపట్టాలన్నారు. బైపాస్ రోడ్డు పనులు, అగ్రికల్చర్ కా లేజీ, వనపర్తి పెబ్బేరు మధ్య 9 కిలోమీటర్ల రో డ్డు, పాలిటెక్నిక్ నూతన హాస్టల్, ప్యాలెస్ ఆధునీకరణ, చిట్యాల, పీర్లగుట్ట డబుల్ బెడ్రూం ఇండ్ల దగ్గర కనీస సౌకర్యాలు కల్పించాలని కో రారు. వీటిపై కలెక్టర్ సానుకూలంగా స్పందించినట్లు మంత్రి తెలిపారు.
అనంతరం జిల్లాకు నూతనంగా వచ్చిన ఎస్పీ రావుల గిరిధర్‌ను కలిశారు. లక్ష్మీపల్లి గ్రామంలో హత్యకు గురైన శ్రీధర్‌రెడ్డి కేసును విచారించి హంతకులను గు ర్తించాలని మాజీ మంత్రి కోరారు. ప్రత్యేక ద ర్యాప్తు బృందం ఏర్పాటు చేశామని, త్వరలోనే నిందితులను అరెస్ట్ చేస్తామని ఎస్పీ చెప్పారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు గట్టుయాదవ్, గ్రంథాలయ సంస్థ జిల్లా మాజీ చైర్మన్ లక్ష్మయ్య, మాజీ జెడ్పీటీసీలు రఘుపతిరెడ్డి, సామ్యానాయక్, మున్సిపల్ చైర్మన్ కరుణశ్రీ, వైస్ చైర్మన్ కర్రెస్వామి, నాయకులు ల క్ష్మారెడ్డి, మాణిక్యం, రాజవర్ధన్ రెడ్డి, అశోక్, జమీల్, రాము, జగన్నాథంనాయుడు, విజయ్‌కుమార్ తదితరులు ఉన్నారు.