మమబూబ్‌నగర్ మెట్టుగడ్డ, అక్టోబర్ 11 : ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో రూ.50వేలు నగదు తరలింపునకు ఆధారాలు తప్పనిసరిగా ఉండాలని, లేదంటే సీజ్ చేస్తామని ఎస్పీ నరసింహ స్పష్టం చేశారు. మంగళవారం రాత్రి జిల్లా కేంద్రంలోని టూటౌన్ సీఐ ప్రవీణ్‌కుమార్ ఆధ్వర్యంలో వాహనాల తనిఖీ చేపట్టారు.
ఓ కారులో రూ.11లక్షల 10వేల నగదు పట్టుబడింది. మహబూబ్‌నగర్‌లోని మలబార్‌కు చెందిన ఉద్యోగస్తులు కారులో నగదు తీసుకెళ్తుండగా పోలీసులు తనిఖీ చేసి, నగదు ఉన్నట్లు గుర్తించారు. వివరాలు చూపించాలని అడుగడంతో వాటికి పత్రాలు లేకపోవడంతో నగదును సీజ్ చేసినట్లు సీఐ తెలిపారు. స్వాధీనం చేసుకున్న డబ్బులను రెవెన్యూ అధికారులకు అప్పగించినట్లు సీఐ తెలిపారు. ఈ మేరకు వివరాలను బుధవారం సీఐ విలేకరులకు తెలిపారు.
మక్తల్ టౌన్, అక్టోబర్ 11 : వాహనాల తనిఖీల్లో రూ.లక్షా 40వేలు స్వాధీనం చేసుకున్నట్లు సీఐ రామ్‌లాల్ అన్నారు. బధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఎన్నికల కోడ్ నేపథ్యంలో మక్తల్ మండలం టేకులపల్లి టోల్గేట్ వద్ద చేపట్టిన వాహనాల తనిఖీల్లో కర్ణాటక రాష్ట్రం రాయిచూర్ నుంచి కారులో హైదరాబాద్ వెళ్తున్న వారిని తనిఖీ చేయగా, ఎలాంటి ఆధారాలు లేకుండా రూ.లక్షా 40వేలు తరలిస్తుండడంతో నగదును సీజ్ చేసి జిల్లా ఎన్నికల ట్రెజరీకి పంపించినట్లు తెలిపారు. వాహనాల తనిఖీల్లో ఎస్సై పర్వతాలు, హోంగార్డు తిరుపతిరెడ్డి ఉన్నారు.
కృష్ణ, అక్టోబర్ 11 : మండలంలోని బార్డర్ చెక్‌పోస్టు వద్ద బుధవారం తనిఖీలు నిర్వహించగా గోవా మద్యం పట్టుబడినట్లు ఎక్సైజ్ సీఐ వెంకట్‌రెడ్డి, ఎస్సై విజయ్‌కుమార్ తెలిపారు. గుర్తు తెలియని వ్యక్తి బైక్‌పై మద్యం తరలిస్తూ చెక్‌పోస్టు వద్ద తనిఖీలను గమనించి బైక్‌ను అక్కడే వదిలేసి పారిపోయినట్లు తెలిపారు. ఏడు మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. తనిఖీల్లో ఎక్సైజ్ సిబ్బంది మల్లన్నగౌడ్, సయ్యద్ బాష, జిల్లా టాస్క్‌ఫోర్స్ సిబ్బంది హహ్మద్పాష, అబ్దల్ రహెమాన్ తదితరులు పాల్గొన్నారు.