Kollapur | కొల్లాపూర్ : భజరంగ్ దళ్ ఆధ్వర్యంలో భజరంగ్ జిల్లా సంయోజక్ భజరంగ్ దళ్ నాగర్ కర్నూల్ జిల్లా ముఖ్య నాయకుల సమావేశం ఆదివారం రామలయంలో నిర్వహించారు. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా తెలంగాణ ప్రాంత గోసంరక్షణ సంయోజక్ సురేష్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ప్రాంతంలో భజరంగ్ దళ్ సేవ సురక్షిత దేయంగ పంచభూతలను కాపాడుకోవాల్సిన బాధ్యత హిందువులపై ఉందన్నారు. ఇందులో భాగంగా చుట్టూ ప్రాంతాలలో మనం మన వంతుగా ప్రతి ఒక్కరూ చెట్లను నాటి వాటి సంరక్షణ బాధ్యత తీసుకోవాలని కోరడం జరిగింది. కొల్లాపూర్ భజరంగ్ దళ్ ఆధ్వర్యంలో రామాలయం నందు మొక్కలు నాటి వాటి సంరక్షణ కోసం భజరంగ్ దళ్ కార్యకర్తలు తీసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో భజరంగ్ దళ్ నాగర్ కర్నూల్ జిల్లా సంయోజక్ భజరంగ్ దళ్ పురెందర్, కొల్లాపూర్ టౌన్ సంయోజక్ పులి భరత్, మహేష్, రవి, వెంటయ్య, గణేష్ , రెడ్డి, చిదనాందం, తదితరులు పాల్గొన్నారు.