గట్టు : గట్టు మండల తహసీల్దార్‌గా మదన్‌మోహన్‌గౌడ్ (Tahsildar Madan Mohan Goud ) ) గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా డిప్యూటీ తహసీల్దార్ విజయ్, కార్యాలయ సిబ్బందికి ఘన స్వాగతం పలికి పండ్ల మొక్కను ( Fruit Sapling) అందించారు. అయితే మండల కాంప్లెక్స్ ఆవరణలో గుంతను తవ్వించి అందులో మొక్కను నాటి నీళ్లు పోశారు.
తాను గట్టులో విధులు నిర్వర్తించే వరకు మొక్కకు రోజు నీళ్లు పోస్తూ సంరక్షించాలని సిబ్బందికి తహసీల్దార్ పురమాయించాడు. ప్రతి ఒక్కరు మొక్కలను నాటి వాతావరణ సమతుల్యతను కాపాడాలని కోరారు. వాతవరణ కాలుష్యాన్ని భావితరాలను కాపాడేందుకు కృషి చేయాలని సూచించారు.