వెల్దండ : ప్రతి విద్యార్థి నేటి పోటీ ప్రపంచాన్ని తట్టుకునేందుకు డిజిటల్ చదువులకు ( Digital Education ) సన్నద్ధం కావాలని టాస్క్ సీఓఓ, ఐక్యత ఫౌండేషన్ చైర్మన్ సుంకి రెడ్డి రాఘవేందర్ రెడ్డి ( Sunki Reddy Raghavendar Reddy ) సూచించారు. గురువారం వెల్దండ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల విద్యార్థులకు ఐక్యత ఫౌండేషన్ (Aikatha Foundation) ఆధ్వర్యంలో పాఠశాల కంప్యూటర్ ల్యాబ్‌కు 8 ల్యాప్ టాబ్లను అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి విద్యార్థి పొటి ప్రపంచంలో ఉన్నతస్థాయికి చేరాలంటే ప్రతి ఒక్కరూ కంప్యూటర్ విద్యలో పరిజ్ఞానం కలిగి ఉండాలన్నారు. ఈ సందర్భంగా రాఘవేందర్ రెడ్డిని శాలువాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ స్వర్ణరత్నం , మాజీ సర్పంచ్ దశరథ్ నాయక్, లాలునాయక్, నర్సింగ్ నాయక్, సభ్యులు రమేష్ నాయక్ ,కొండల్ యాదవ్, శ్రీపతి, తదితరులు పాల్గొన్నారు.