వనపర్తి, సెప్టెంబర్ 3 : ప్రభుత్వం అమలుచేస్తున్న ప్రతి పథకాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి యువతకు సూచించారు. ఆదివారం రాత్రి జిల్లాకేంద్రంలోని నివాస గృహంలో ఏర్పాటు చేసిన సమావేశానికి మంత్రి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ప్రపంచంతో పోటి పడే సత్తా యువతకు మాత్రమే ఉందన్నారు. వారు పనిచేసే ప్రభుత్వం వైపు అడుగులు వేస్తుండడం ఆనందంగా ఉందన్నారు.
వీలున్న సమయంలో ప్రభుత్వం పథకాలను సోషల్ మీడియా వేదికగా వివరించాల్సిన బాధ్యత తీసుకోవాలని కోరారు. అనంతరం రేవల్లికి చెందిన 30మంది కాంగ్రెస్, బీజేపీ నాయకులు స్థానిక నాయకుడు శివరాంరెడ్డి ఆధ్వర్యంలో క్యాంపు కార్యాలయంలో మంత్రి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. కార్యక్రమంలో నియోజకవర్గ ఎన్నికల సమన్వయకర్త ప్రమోద్‌రెడ్డి, రాష్ట్ర మార్క్‌ఫెడ్ డైరెక్టర్ విజయ్, బీఆర్ఎస్ జిల్లా అధికార ప్రతినిధి శ్రీధర్, పట్టణ అధ్యక్షుడు రమేశ్‌గౌడ్, నాయకులు, యువత పాల్గొన్నారు.