దామరగిద్ద : కార్మిక సంఘాల ఐక్యవేదిక పిలుపులో భాగంగా బుధవారం తలపెట్టిన భారత బంద్‌ను జయప్రదం చేయాలని అఖిల భారత ఐక్య రైతు సంఘం దామరగిద్ద మండలం అధ్యక్షుడు పెద్దింటి తాయప్ప పిలుపునిచ్చారు. నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని గత నాలుగు సంవత్సరాలుగా పోరాడుతున్న కార్మికులను కేంద్రం పట్టించుకోవడం లేదని ధ్వజమెత్తారు. కార్మికులకు నష్టాలు కలిగించే లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని లేని యెడల పోరాటం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. దామరగిద్ద మండల ప్రజలు సహకరించాలని పివైఎల్పీడీఎస్యూ నాయకులు కోరారు.