నారాయణపేట : అర్హుడైన ప్రతీ పౌరుడు ఓటర్ జాబితా ( Voter list ) లో పేర్లను నమోదు చేయించుకోవాలని మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు యస్. రాజేందర్ రెడ్డి ( S. Rajender Reddy ) నియోజకవర్గ ప్రజలకు పిలుపునిచ్చారు. గురువారం నియోజకవర్గం లోని కోయిల్ కొండ మండలం స్వగ్రామం శేరివెంకటపూర్ లో కుటుంబ సమేతంగా కలిసి బీఎల్వోలకు వివరాలను అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…ఓటరుగా నమోదు కావడం ప్రజాస్వామ్యానికి ఎంతో ముఖ్యమని అన్నారు. ఓటరు జాబితాలో పేరు నమోదు, ఎన్యూమరేషన్ (Enumeration) దరఖాస్తు ప్రక్రియల్లో ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడకుండా చూడాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో మండల సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.