కల్వకుర్తి, జూలై 22 : పారిశుధ్య నిర్వహణలో ప్రభుత్వం సరికొత్త విధానానికి కృషి చేస్తున్నది. ఇప్పటికే సెగ్రిగేషన్ ( చెత్తనుంచి బయోగ్యాస్, రిసైక్లింగ్) షెడ్లను ఏర్పాటు చేసిన ప్రభుత్వం మరో అడుగు ముందుకు వేసింది. వ్యర్థాల నుంచి ఎరువులను త యారు చేసే ప్లాంట్ ఏర్పాటు కు శ్రీకారం చుట్టింది. ఇందుకోసం మున్సిపల్ అధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక పంపిన నేపథ్యంలో.. కల్వకుర్తి మున్సిపాలిటీలో ఎఫ్ఎస్టీపీ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇ చ్చింది. ఎఫ్ఎస్టీపీ (మలమూ త్ర వ్యర్థాలతో ఎరువులను తయా రు చేసే ప్లాంట్) కోసం రూ.కోటి మం జూరు చేసింది. ఎఫ్ఎస్టీపీ నిర్మాణ ప నుల టెండర్‌ను డ్రైనీర్ సంస్థ దక్కించుకున్నది.
స్థలం కేటాయించిన అధికారులు..
ఎఫ్ఎస్టీపీ ఏర్పాటు కోసం మున్సిపల్ అధికారులు స్థానిక సీబీఎం కళాశాల వెనుక భాగంలో సెగ్రిగేషన్ షెడ్ వద్ద 20గుంటల స్థలాన్ని ఎంపిక చేశారు. సెగ్రిగేషన్ షెడ్ నిర్మాణం కోసం ఇదివరకే నాలుగు ఎకరాల స్థలాన్ని కొనుగోలు చేసింది. ఇదే స్థలంలో ముందుభాగాన ఎఫ్ఎస్టీపీ కోసం మున్సిపల్ అధికారులు స్థలాన్ని కేటాయించి మార్కింగ్ చేశారు. టెండర్ దక్కించుకున్న డ్రైనీర్ సంస్థ రెండు, మూడు రోజుల్లో పనులు ప్రారంభించనున్నది.
వ్యర్థాల నుంచి ఎరువుల తయారీ..
మలమూత్ర వ్యర్థాలే కాకుండా, మురుగుకాల్వలలో పేరుకుపోయిన పూడికతో ఎఫ్ఎస్టీపీ ద్వారా ఎరువులను తయారు చేస్తారు. ఇందుకు సంబంధించిన యంత్రాలు, పరికరాలు డ్రైనీర్ సంస్థ సమకూర్చుకుంటున్నది. ఇండ్లలో ఏర్పాటు చేసుకున్న సెప్టిక్ ట్యాంకుల నుంచి వ్యర్థాలను, మురుగుకాల్వలలో పేరుకుపోయిన వ్యర్థాలను సేకరించి ట్రీట్మెంట్ ప్లాంట్‌కు పంపుతారు. అక్కడ వ్యర్థాల నుంచి ఎరువులను తయారు చేస్తారు. ఇందుకుగానూ మున్సిపాలిటీకి నిబంధనల ప్రకారం డబ్బులు చెల్లిస్తారు. సెగ్రిగేషన్ షెడ్లు, ఎఫ్ఎస్టీపీ ద్వారా కల్వకుర్తి మున్సిపాలిటీకి అదనపు ఆదాయం సమకూరనుంది.
నాగర్‌కర్నూల్ జిల్లాలో మొదటి ఎఫ్ఎస్టీఎపీ..
నాగర్‌కర్నూల్ జిల్లాలో ఎఫ్ఎస్టీపీ ఎక్కడ ఏర్పాటు చేయలేదు. కల్వకుర్తిలోనే మొదటగా ఏర్పాటుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇందుకోసం స్థలాన్ని ఎంపిక చేశాం. రెండు, మూడు రోజుల్లో మార్కింగ్ ఏర్పాటు చేస్తాం. సెగ్రిగేషన్ షెడ్డు పనులు పూర్తయ్యాయి. చెత్త రిసైక్లింగ్, ఎఫ్ఎస్టీపీ ప్రారంభమైతే కల్వకుర్తి మున్సిపాలిటీకి రాయల్టీ ద్వారా అదనపు ఆదాయం సమకూరుతుంది.
– అశ్రిత్‌కుమార్, కమిషనర్, కల్వకుర్తి మున్సిపాలిటీ
ఆదర్శవంతంగా తీర్చిదిద్దడమే లక్ష్యం..
కల్వకుర్తి మున్సిపాలిటీని ఆదర్శవంతగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాం. ఇందుకోసం మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్, ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ ఎంతో సహకరిస్తున్నారు. స్వచ్ఛభారత్‌లో కల్వకుర్తి అవార్డు సాధించింది. పరిశుభ్రతకు పెద్దపీట వేయడంతోపాటు అదనపు ఆదాయం సమకూరేలా ముందుకు సాగుతున్నాం. చెత్త రిసైక్లింగ్ కోసం సెగ్రిగేషన్ షెడ్లతోపాటు ఎఫ్ఎస్టీపీ ఏర్పాటు చేస్తున్నాం.
– ఎడ్మ సత్యం, మున్సిపల్ చైర్మన్, కల్వకుర్తి మున్సిపాలిటీ