అచ్చంపేట, నవంబర్ 2 : నల్లమల బిడ్డనని చెప్పుకునే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి నల్లమల గిరిజనులు సర్వం కోల్పోయి ప్రాణాలు పోతుంటే పట్టించుకోకుండా జూబ్లీహిల్స్ ఎన్నికలే ముఖ్యంగా వ్యవహరిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే, అచ్చంపేట బీఆర్ఎస్ పార్టీ సమన్వయకర్త మర్రి జనార్ధన్‌రెడ్డి మండిపడ్డారు. మొంథా తుఫాన్ కారణంగా నక్క లగండి రిజర్వాయర్ బ్యాక్‌వాటర్‌లో అచ్చంపేట మండలం మార్లపాడుతండా మొత్తం నీటిలో ము నిగిపోయింది. కరెంటు స్తంభాల పై వరకు వరద రా వడంతో తండాలో ఉన్న 350కిపైగా ఇండ్లు మొత్తం నీటిలో మునిగిపోయాయి. సర్వం కోల్పోయి తా గడానికి నీళ్లు, వండుకొని తినేందుకు బియ్యం, పాత్ర లు, సరుకులు కూడా లేని దుర్భర పరిస్థితి నెలకొన్న ది.
ఈ క్రమంలో ఆదివారం మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్‌రెడ్డి స్థానిక బీఆర్ఎస్ నేతలతో కలిసి బు రదలో కురుకుపోయిన తండాలో పర్యటించారు. ఒక్కో ఇంటికి వెళ్లి వారి బాధను కళ్లారా చూశారు. కొందరు గిరిజనులు, మహిళలు బీఆర్ఎస్ నేతలు, మర్రిని చూసి బోరున విలపించారు. మా బాధను మీతోనైనా చెప్పుకుంటామని రోధించారు. తినేందు కు తిండి, తాగేందుకు నీళ్లు కూడా లేవన్నారు. పం టలు, ఇంట్లో వస్తువులు, బంగారం, డబ్బు, పశువు లు, మేకలు సర్వం కోల్పోయి ఎలా బతకాలో కూడా తెలియడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మర్రిని పట్టుకొని ఏడ్చారు. ఆయన వారిని ఓదార్చారు. బురదలోనే కాలినడకన తిరిగారు. ఎంజేఆర్ ట్రస్టు ఆధ్వర్యంలో ఒక్కో కుటుంబానికి 25కిలోల సన్న బియ్యం, 9 రకాల నిత్యావసర సరుకులు 200 కు టుంబాలకు పంపిణీ చేశారు.
బియ్యం, సరుకులు అందించి ఆకలి తీర్చిన మర్రిని చూసి మహిళలు చేతులు జోడించి సల్లాగుండాలని దీవించారు. స్థానిక ఎమ్మెల్యే వంశీకృష్ణ ఒక్కపూట అలా వచ్చి వెళ్లిపో యిండే తప్పా తమ బాధలు పట్టించుకోలేఉదని గిరిజనులు మండిపడ్డారు. మా ప్రాణాలు పోతున్నా ఎమ్మెల్యే స్పందించడం లేదన్నారు. అనంతరం గిరి జనులను ఉద్దేశించి మర్రి జానర్దన్‌రెడ్డి మాట్లాడారు. మార్లపాండుతండా నక్కలగండి రిజర్వాయర్‌లో ము గినిపోతుందని.. ఇక వీళ్లతో మాకేం పనుందని ఎమ్మె ల్యే వంశీకృష్ణ, కాంగ్రెస్ పార్టీ భావిస్తున్నట్లు ఉం దన్నారు. ఆపత్కాలంలో ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉండదా అని ప్రశ్నించారు. తండావా సుల బాధను చూడలేక ఎంజేఆర్ ట్రస్టు ఆధ్వర్యంలో బియ్యం, సరుకులు అందించి కొంతమేర ఆకలి తీర్చేందుకు తాను వచ్చానన్నారు. ఆపత్కాలంలో సాయం చేయడం మానవ ధర్మమన్నారు. నేను ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థిని కాదని.. నాకు పోటీచేసే అవసరం లేదని.. కేవలం మానవత్వంతో మీకు సాయం చేసేందుకు వచ్చానని పేర్కొన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వానికి జూబ్లీహిల్స్ ఎన్నికలపై ఉన్న ధ్యాస మార్లపాడుతండాపై లేదని మర్రి మండిపడ్డారు. నల్లమల వ్యక్తినని చెప్పుకునే సీఎం రేవంత్‌రెడ్డి తండా మునిగి గిరిజనులు అరిగోస పడు తూ ఆరు రోజులైనా ఎందుకు ఇప్పటి వరకు పట్టించుకోలేదని నిలదీశారు. ప్రభుత్వం ఇప్పటికైనా కదిలివచ్చి తండావాసులు బాధలు తెలుసుకొని వారి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఆర్ అండ్‌ఆర్ ప్యాకేజీ నిధులు కూడా విడుదల చే యా లన్నారు. ఇంటికి 25-30 ఫీట్ల ఎత్తులో నీళ్లు ప్రవ హించి తీవ్రంగా నష్టపోయినా ప్రభుత్వం పట్టిం చుకునే పరిస్థితి లేదని ధ్వజమెత్తారు. విద్యా ర్థుల విద్యార్హత సర్టిఫికెట్లు తడిచిపాడైపోవడంతో వాటిని మర్రి పరిశీలించారు.
రాష్ట్ర చీఫ్ సెక్రటరీని కలిసి మీ సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసు కెళ్తామన్నారు. మన్నెవారిపల్లి, జోగ్యతండా, దేవులతండా గిరిజను ల భూములుపోయి ఉపాధి లేకుండా మారారని, వారికి రావాల్సిన నిధులు వెంటనే విడుదల చేయాలన్నారు. ఎస్ఎల్బీసీ ప్రాజెక్డు నత్తనడకన సాగుతున్నదని, ప్రాజెక్టు ఉంటుందో లేదో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకో లేదన్నారు. ముంపు గ్రా మాలకు రావాల్సిన నిధులు, పున రావాసం వెంటనే కల్పించాలన్నారు. గిరిజనులకు బీఆర్ఎస్ పార్టీ అండ గా ఉంటుందన్నారు. తిరుగు ప్రయాణంలో మన్నె వారిపల్లి వద్ద వాగును పరిశీలించారు.
వాగులో రైతుల మోటర్లు, వరి మునిగిపోయాయి. రైతులను ఓదార్చారు. అచ్చంపేట మండలం దుబ్బతండాకు చెందిన ముడావత్ బిక్యా రెండు ఎద్దులు వాగులో కోట్టుకోపోగా, బాధిత రైతు ను పరామర్శించి ధైర్యం కల్పించారు. సిద్దాపూర్, బొమ్మన్‌పల్లి, మన్నె వారి పల్లి, ఐనోలులో బీఆర్ఎస్ ముఖ్యులను కలిశారు. బొమ్మన్‌పల్లి మాజీ సర్పంచ్ బోడ్కనాయక్ ఇంటి వద్ద మధ్యాహ్న భోజనం చేశారు. అక్కడ స్థానిక నాయకులు, కార్యకర్తలతో పార్టీ బలోపేతం తదితర అంశాలపై చర్చించారు. ఆయన వెంట రైతు సమితి మాజీ జిల్లా అధ్యక్షుడు పోకల మనోహర్, మైనార్టీ నాయకుడు అమీనొద్దీన్, మాజీ మున్సిపల్ చైర్మన్లు నర్సింహగౌడ్, తులసీరాం, మాజీ ఎంపీపీ పర్వ తాలు, వెంకటయ్య, వంశీనాయక్, రాజిరెడ్డి, రా జేశ్వర్రావు, మోహన్‌రెడ్డి, జగన్, లక్ష్మణ్ ఉన్నారు.