వనపర్తి, సెప్టెంబర్ 26 (నమస్తే తెలంగాణ) : మిల్లర్లకు ప్ర భుత్వం కేటాయించిన సీఎంఆర్ (కస్టమ్స్ మి ల్లింగ్ రైస్) ధాన్యాన్ని మిల్లింగ్ చేసి ఇవ్వాల్సిన చర్యల్లో మిల్లర్లు దొంగాట ఆడుతున్నారు. బకాయి ఉన్న మిల్లులపై చర్యలు తీసుకుంటు న్నా పెద్దగా పట్టించుకోవడం లేదు. మూడు సీజన్లకు సంబంధించి జిల్లాలోని రైస్ మిల్లర్లకు ఇచ్చిన గడువు ముగుస్తున్నా.. రావాల్సిన బి య్యం కేటాయింపులు రాకపోవడంతో సమ స్య జఠిలమవుతుంది. వనపర్తి జిల్లాలో మొ త్తం 172 రైస్ మిల్లులు ఉన్నాయి.
వీటిలో చాలా వరకు ప్రభుత్వాన్ని బురిడీ కొట్టిస్తున్న మిల్లులే అధికంగా ఉన్నాయి. ఏటా సీజన్లో వడ్లు తీసుకొని బియ్యం నిల్వలను ప్రభుత్వానికి ఇవ్వడంలో మీనమేషాలు లెక్కిస్తున్నాయి. సామ, దాన, దండోపాయాలు ఎన్ని ప్రయోగించినా ప్రభుత్వానికి ఇవ్వాల్సిన బియ్యం మాత్రం మిల్లర్లు ఇవ్వడం లేదు. ప్రభుత్వం కేటాయించిన ధా న్యంలో మర ఆడించి 67 శాతం బియ్యం ఇవ్వాలి. ఇప్పటికీ ఎన్నోసార్లు ఇచ్చినా గడువులన్నింటినీ మిల్లర్లు తుంగలో తొక్కుతున్నారు. జిల్లాలో మూడు సీజన్లకు సంబంధించి లక్షా 68 వేల మెట్రిక్ టన్నుల బియ్యం మిల్లర్ల నుం చి ప్రభుత్వానికి రావాల్సి ఉన్నది.
2023-24కు సంబంధించి వానకాలంలో 1.91లక్షల టన్నుల ధాన్యాన్ని 82 మిల్లులకు ప్రభుత్వం కేటాయించింది. వీటికి సంబంధించి లక్షా 28 వేల బియ్యం మిల్లర్ల నుంచి రావాలి. కేవలం 48 వేల టన్నులు మాత్రమే వచ్చాయి. ఇంకా 80 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం ప్రభుత్వానికి మిల్లర్ల ఇవ్వాల్సి ఉన్నది. వీటికి సంబంధించి అనేక మిల్లుల్లో వడ్ల నిల్వలు లేకపోవడంతో గడువులోపు బియ్యం కేటాయింపులు వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. ఈ సీజన్‌కు సంబంధించి ప్రభుత్వం ఈనెల 30ని చివరి గడువుగా ప్రకటించింది.
2023-24 యాసంగికి సంబంధించి కేవ లం 27 మిల్లులకు మాత్రమే ప్రభుత్వం వడ్ల ను కేటాయించింది. మిగిలిన మిల్లులన్నీ డీఫాల్టర్ కిందకి రావడంతో సక్రమంగా ఉన్న మి ల్లులకే అన్నట్లు ఈ కేటాయింపులు జరిపింది. ఈ మిల్లుల యజమానులు కూడా బియ్యం కేటాయింపులు చేయకుండా మొండికేశారు. ఈ సీజన్లో 61వేల మెట్రిక్ టన్నుల బియ్యం మిల్లర్ల నుంచి రావాలి. కేవలం 12,500 మె ట్రిక్ టన్నులు మాత్రమే ఇచ్చారు. ఇంకా 48 వేల మెట్రిక్ టన్నులకుపైగా మిల్లర్లు బకాయి పడ్డారు. ఇలా ఈ సీజన్‌లోని బకాయి ఉన్న బియ్యాన్ని ఇచ్చేందుకు సైతం ఈనెల 30వ తేదీని చివరిగా ప్రకటించింది. దీంతో ఒక సీజన్‌కు ఈ రోజుతో గడువు ముగుస్తుండగా, మిగిలిన రెండు సీజన్ల బియ్యానికి మరో మూ డ్రోజులు మాత్రమే గడువు మిగిలి ఉన్నది. ఈలో గా బకాయి క్లియరెన్స్ అవుతుందన్న నమ్మకం మాత్రం మిల్లర్లపై రావడం లేదు.
సీఎంఆర్ బియ్యం ఇవ్వని మిల్లర్లకు ఇ చ్చిన గడువు ముగుస్తున్నది. 2022-23 వానకాలం సీజన్‌కు సంబంధించిన బకా యి చెల్లించేందుకు నేడు చివరి గడువు. ఇం కా 2023-24 వానకాలం, యాసంగిలో నూ బకాయి ఉన్న మిల్లులకు 30వరకు గ డువు మిగిలి ఉన్నది. అప్పటి వరకు ఈ బ కాయిలను చెల్లించని పక్షంలో కేంద్ర ప్ర భుత్వం తీసుకునే నిర్ణయం మేరకు చర్యలు తీసుకుంటాం. మిల్లర్ల నుంచి సీఎంఆర్ బ కాయికి సంబంధించిన వసూళ్ల కోసం అన్ని చర్యలు తీసుకుంటున్నాం.
– ఇర్ఫాన్, డీఎస్వో, వనపర్తి
2022-23 వానకాలం సీజన్‌కు సంబంధించి 68 వేల టన్నుల బియ్యం ప్రభుత్వానికి మిల్లర్ల నుంచి రావాలి. ఇందులో కేవలం 28 వేల టన్నుల బియ్యం మాత్రమే ప్ర భుత్వానికి చేరాయి. ఇంకా 40 వేల టన్నుల ధాన్యం పెండింగ్‌లో ఉన్నాయి. ఈ సీజన్లో 82 మిల్లులు డీఫాల్ట్ కిందకి రాగా, కేవలం 5 మిల్లులు మాత్రమే క్లియరెన్స్ పొం దాయి. దీంతో మిల్లర్ల్ల బకాయిని క్లియర్ చేయడం కోసం ఇచ్చిన గడువు చివరి దశకు చేరుకున్నది. అయినా బకాయిలు మాత్రం అలాగే ఉన్నాయి. ఈనెల 27న (శుక్రవారం) అంటే ఈరోజు వరకు ఈ సీజన్‌కు సంబంధించి ప్రభుత్వం ఈ బకాయిని పూర్తి చేసేందుకు గడవు విధించింది.
ప్రతి సీజన్‌కు సంబంధించి ప్రభుత్వం ధాన్యాన్ని మిల్లర్లకు కేటాయిస్తూ వస్తున్నది. మిల్లర్ల యజమానులు ఇతర రాష్ర్టాలకు బియ్యాన్ని తరలించి రూ.కోట్ల సొమ్మును మూటగట్టుకున్నారు. మిల్లర్ల వ్యవహారాన్ని గత అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరించడంతో ఏటా పెండింగ్ పెరుగుతూ వచ్చిం ది. మిల్లుల్లో జరుగుతున్న తతంగమంతా తెలిసినా పట్టించుకోకపోవడంతోనే నేడు బకాయి పెరడగానికి కారణంగా చెప్పొ చ్చు. ఇందులో రూ.లక్షలు చేతులు మారాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
చివరకు ఆలస్యంగా మేల్కొని మిల్లులపై దా డులు చేస్తున్నా.. ప్రయోజనం లేకుండా పోతున్నది. కొద్దిమేర మాత్రమే వసూలు కావడం.. పెద్ద మొత్తంలో బకాయి పెం డింగ్లోనే ఉండడంతో అధికార యంత్రాంగానికి పెను సవాలుగా నిలుస్తున్నది. ప్రజల సొమ్ము పరులపాలు అన్నట్లు రైస్ మిల్లర్లు దర్జాగా ధాన్యం బస్తాలను లూఠీ చేసినా పట్టించుకోకపోవడంతో ఈ పరిస్థితులు వచ్చాయన్న విమర్శలున్నాయి.