వెల్దండ : తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ 1104 యూనియన్ ( Electricity Employees Union) ఆధ్వర్యంలో మండల కేంద్రంలో గురువారం మేడే వేడుకలను ( May Day) ఘనంగా నిర్వహించారు. వెల్దండ సెక్షన్ నాయకులు బంగారి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో వెల్దండ మండల కేంద్రంలో యూనియన్ కార్మికులు భారీ ర్యాలీ నిర్వహించారు. అంతకుముందు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. యూనియన్ రాష్ట్ర కార్యదర్శి సాయిబాబా ముఖ్యఅతిథిగా పాల్గొని 1104 యూనియన్ జెండాను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1104 యూనియన్ అతిపెద్ద యూనియన్ గా అవతరించిందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు రామ్ చందర్ నాయక్, డివిజన్ అధ్యక్షుడు విజయభాస్కర్, సబ్ డివిజన్ అధ్యక్షుడు నర్సిరెడ్డి, కార్యదర్శి లక్ష్మణ్ నాయక్, వెల్దండ సెక్షన్ కార్మికులు విక్రమ్ రెడ్డి, కృష్ణయ్య, యాదయ్య,,శ్రీను, సాంబశివుడు, లస్కర్, మాధవులు, లక్ష్మణ్, వెంకటపతి, రవీందర్, సాంబశివుడు, మల్లేష్ యాదగిరి, నాగేష్, కృష్ణారెడ్డి, కృష్ణయ్య , అంజయ్య తదితరులు పాల్గొన్నారు.