గద్వాల, జనవరి 22 : ప్రాణాపాయ స్థితిలో చికి త్స అందించేందుకు క్రిటికల్ కేర్ బ్లాక్ దోహదం చేస్తుందని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి తెలిపారు. జిల్లా కేంద్రంలోని 300 పడకల దవాఖాన సమీపంలో ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారికి చికిత్స అందించేందుకు రూ.27.75 కోట్లతో మంజూరైన క్రిటికల్ కేర్ బ్లాక్ భవన నిర్మాణానికి మున్సిపల్ చైర్మన్ బీఎస్ కేశవ్‌తో కలిసి సోమవారం ఎమ్మెల్యే భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు. ఈ సం దర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కేంద్రం మానవసేవే.మాధవ సేవలో భాగంగా జోగుళాంబ గద్వాల జిల్లాకు క్రిటికల్ కేర్ బ్లాక్‌ను మంజూరు చేసిందన్నా రు. రోడ్డుప్రమాదంలో గాయపడడం, పాముకాటు వంటి ప్రాణాపాయ స్థితిలో ఉన్న వ్యక్తులకు అత్యవసర చికిత్స అందించడానికి ఇది ఎంతగానో ఉపయోగ పడుతుందని తెలిపారు. త్వరలో దీని నిర్మా ణ పనులు పూర్తి చేసి అన్ని రకాల సదుపాయాలతో అందుబాటులోకి తెస్తామన్నారు. కాంట్రాక్టర్లు పను లు నాణ్యతతో త్వరలో పూర్తి చేయాలని ఆదేశించారు. అనంతరం అక్కడే నిర్మాణం జరుగుతున్న నర్సింగ్ కళాశాల వసతి గృహ నిర్మాణ పనులను ఎమ్మెల్యే పరిశీలించారు. పనులు వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో ఎంపీపీ ప్రతాప్‌గౌడ్, వైస్ చైర్మన్ బాబర్ కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.
అయోధ్యలో రామాలయ నిర్మాణం ప్రజల శతాబ్దాల కల అని అది ప్రస్తుతం నెరవేరిందని, బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతున్నట్లు ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రె డ్డి తెలిపారు. అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవ సందర్భంగా జిల్లా కేంద్రంలోని రాంనగర్లో ఉన్న రామాలయం, కాళిమాత ఆలయాల్లో ఎమ్మెల్యే పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐదు శతాబ్దాల భారతీయుల సుంద ర స్వప్నం నేడు సాధ్యమైందన్నారు. కార్యక్రమం లో మున్సిపల్ చైర్మన్ కేశవ్, ఎంపీపీ విజయ్, మా ర్కెట్ కమిటీ చైర్మన్ శ్రీధర్‌గౌడ్ ఉన్నారు.