ఆత్మకూరు, జూలై 17 : ఎగువ, దిగువ జూరాల జలవిద్యుత్ కేంద్రాల్లో విద్యుదుత్పత్తి ప్రా రంభమైంది. జిల్లా లో కురుస్తున్న వర్షా లు, ఎగువ నుంచి వస్తున్న వరదల నే పథ్యంలో జూరాల రిజర్వాయర్‌కు జలకళ సంతరించుకు న్నది. దీంతో ఉన్నతాధికారులు బుధవారం జలవిద్యుత్ కేంద్రాల్లో విద్యుదుత్పత్తిని ప్రారంభించారు.
ఎస్ఈ కల్లూరి రామసుబ్బారెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించి విద్యుదుత్పత్తిని ప్రారంభించారు. ఎగువ జూరాలలో సాయంత్రం ఒక్క యూనిట్లో, దిగువ జూరాలలో రాత్రి ఒక్క యూనిట్లో విద్యుదుత్పత్తిని ప్రారంభించా రు. ఎగువ నుంచి వస్తున్న వరద ఉధృతిని బట్టి నేటి సాయంత్రానికి అన్ని యూ నిట్లు వినియోగంలోకి తీసుకొచ్చే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో విద్యుత్ ఇంజినీర్లు, అధికారులు పాల్గొన్నారు.