మక్తల్, ఫిబ్రవరి 12 : రేవంత్‌రెడ్డి ప్రజాప్రభుత్వంలో ఎన్నికల నిర్వహణ చూస్తుంటే బహిరంగంగా ఓటు హకు ను వినియోగించుకొని బ్యాలెట్ పేపర్‌ను సోషల్ మీడియాలో వైరల్ చేసిన ఘటన మక్తల్ మున్సిపాలిలో చోటుచేసు కున్నది. వివరాల్లోకి వెళ్తే బుధవారం మక్తల్ మున్సిపాలిటీలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా, 12వ వార్డు పోలింగ్ బూత్‌లో 1028 నెంబర్ గల బ్యాలెట్ పేపర్ కాంగ్రెస్ అభ్యర్థికి ఓటు వేసి ఉన్న బ్యాలెట్ పేపర్ సోషల్ మీడియాలో చకర్లు కొట్టింది. ఎన్నికల నిర్వహణ పకడ్బందీగా చేపట్టాల్సిన అధికారులు, అవేమీ పట్టించుకోకుండా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు ఏజెంట్లుగా మారిపోయారు.
దీంతో కాంగ్రెస్ పార్టీ వారు ఇష్టానుసారంగా, పోలింగ్ బూత్‌ల్లో సంచరించినప్పటికీ, తమకు ఏమి తెలియనట్టుగా ఎన్నికల సిబ్బంది వ్యవహరించడంతోనే, 12వ వార్డులో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసిన బ్యాలెట్ పేపర్‌ను ఎవరో ఫోన్లో ఫొటో తీసి సోషల్ మీడియాలో పెట్టినట్లు ప్రజలు చెబుతున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో అధికార పార్టీకి ఎన్నికల అధికారులు ఏ విధంగా సహాయం చేశారో దీని చూసే అర్థమవుతుందని పట్టణ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బ్యాలెట్ పేపర్ సోషల్ మీడియాలో వైరల్ చేసిన వ్యక్తిపై చర్యలు తీసుకునే విధంగా ఎన్నికల అధికారులు చర్యలు చేపడతారా లేదా వేచి చూడాల్సిందే.