నారాయణపేట : పంచాయతీ మొదటి విడత ఎన్నికల పోలింగ్(Panchayat Polling ) నారాయణపేట జిల్లాలో ( Narayanpet district ) ప్రశాంతంగా కొనసాగుతుంది. గురువారం ఉదయం 7 గంటల నుంచి ప్రారంభమైన పోలింగ్ మధ్యాహ్నం వరకు కొనసాగింది. గడువులోగా ఓటు హక్కును వినియోగించుకునేందుకు వచ్చిన ఓటర్లను క్యూలైన్లో ఉంచి వారికి టోకెన్లు అందజేశారు.
ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల సాధారణ పరిశీలకురాలు సీతాలక్ష్మి ( Sita Laxmi ) మద్దూరు మండలంలోని పెదిరిపాడు, చెన్నారెడ్డి పల్లి, కొత్తపల్లి మండల కేంద్రం, కొత్తపల్లి తండా లోని పోలింగ్ కేంద్రాలను ఆమె సందర్శించి పోలింగ్ ప్రక్రియను పరిశీలించారు. పోలింగ్ నమోదు శాతాన్ని అడిగి తెలుసుకున్నారు. ఓటర్లతో ఆమె మాట్లాడి సౌకర్యాల గురించి ఆరా తీశారు.