మహబూబ్‌నగర్, డిసెంబర్ 4 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): రెండేళ్లుగా ఊరిస్తూ వచ్చిన పంచాయ తీ ఎన్నికల సమ రం ఎట్టకేలకు మొదలైంది. తొలి విడుత ప ంచాయతీలకు నామినేషన్ల ఉపసంహరణ పూర్త యి తుది జాబితా ప్రకటించడంతో అభ్యర్థులంతా రం గంలోకి దిగారు. ఓటర్లలో ఆకట్టుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. గ్రామపంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైనప్పటి నుంచి గ్రామాల్లో ఎన్నికల వాతావరణం వేడెక్కింది. ఉమ్మడి మ హబూబ్‌నగర్ జిల్లాలో మూడు విడుతల్లో జరుగుతున్న గ్రామపంచాయతీ ఎన్నికలు అసెంబ్లీ ఎన్నికలను తలపిస్తున్నా యి.
అనేక చోట్ల సర్పంచ్‌గా గెలిపిస్తే గ్రామాభివృద్ధికి పాటుపడుతామని ఏకగ్రీవాలకు తెర లేపారు. కొన్నిచోట్ల వేలం పాటలు కూడా నిర్వహించి సర్పంచ్ పదవులను కైవసం చేసుకున్నారు. అధికార పార్టీ అనేక ప్రలోభాలు పెట్టి స్థానిక ఎన్నికల్లో మెజారిటీ స్థానాలను దక్కించుకునేందుకు చేస్తున్న ప్రయత్నాలను బీఆర్ఎస్ ఎక్కడికక్కడే తిప్పి కొడుతున్నది. ఏకగ్రీవాల్లో అధికార పార్టీకి దీటుగా గులాబీ దళం మద్దతిచ్చిన అభ్యర్థులు ఎన్నిక కావడం కాంగ్రెస్ పార్టీకి షాక్ ఇచ్చినట్లయింది. తాజాగా రెండో విడుత ఉపసంహరణ గడువు కూడా ముగియనుండడం.. మూడో విడుత నామినేషన్ల పర్వం
కొనసాగుతుండడంతో ఉమ్మడి జిల్లా వ్యాప్త ంగా గ్రా మా ల్లో సందడి నెలకొన్నది. ఆశావహులు తమకు తోచిన ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఏకగ్రీవాల కోసం గ్రామాల్లో జరుగుతున్న చర్చలపై పోలీసులు నిఘా ఉంచారు. వేలం పాటలో పదవులు దక్కించుకుంటున్నారని తెలిసి కొన్ని చోట్ల వాటిని అడ్డుకుంటున్నారు.
మంత్రులు, ఎమ్మెల్యేలకు సవాల్‌గా..
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండేళ్ల తర్వాత నిర్వహిస్తున్న గ్రామపంచాయతీ ఎన్నికల్లో అధికార పార్టీకి చెంది న మంత్రులు, ఎమ్మెల్యేలకు పంచాయతీ ఎన్నికలు సవాల్‌గా మారాయి. అసలే సీఎం సొంత జిల్లా కావడంతో ఈ ఎన్నికలను కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నా ఎక్కడా అనుకున్న స్థాయిలో నాయకులను సమన్వయం చేయలేకపోతున్నారు. ఏకగ్రీవాల్లో కూడా బీఆర్ఎస్ మద్దతిచ్చిన చాలామంది సర్పంచులుగా ఎన్నికయ్యారు. మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రాతినిధ్యం వహిస్తున్న కొల్లాపూర్ నియోజకవర్గంలో కేవలం ఒకే ఒక్క చోట్ల ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
మిగతా చాలాచోట్ల గట్టిపోటీ ఎదుర్కొంటున్నారు. ఇక మరో మంత్రి వాకిటి శ్రీహరి సొంత నియోజకవర్గంలో కూడా ప్రతికూల పరిస్థితులు కనిపిస్తున్నాయి. పంచాయతీ ఎన్నికల్లో అధికార పార్టీ తరఫున పోటీ చేసేందుకు అభ్యర్థులు వెనుకంజ వేస్తున్నారు. నేతల మధ్య సమన్వయ లోపం అసంతృప్తి రాజుకోవడంతో సర్పంచ్ అభ్యర్థుల ఎంపిక తలనొప్పిగా మారింది. ఇక ఎమ్మెల్యేలకు కూడా పంచాయతీ ఎన్నికలు పరీక్షగా మారాయి. అనేకచోట్ల గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీకి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతున్న నేపథ్యంలో అంటి ముట్టనట్లు వ్యవహరిస్తున్నారు. గ్రామాలకు వెళ్లడానికి జంకుతున్నారు. క్యాంప్ ఆఫీసులో అభ్యర్థులను ప్రకటించి వెళ్లిపోతున్నారు.
ఏకగ్రీవాల్లో బీఆర్ఎస్ మార్క్..
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాల్లో అనేకచోట్ల ఏకగ్రీవాలు కాంగ్రెస్‌కు సరి సమానంగా బీఆర్ఎస్ అభ్యర్థులు సర్పంచ్ పదవులను కైవసం చేసుకున్నారు. వనపర్తి జిల్లాలో మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి చలువతో ఏకంగా నాలుగు సర్పం చ్ స్థానాలు ఏకగ్రీవంగా బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. గద్వాల, నాగర్‌కర్నూల్ జిల్లాలో బీఆర్ఎస్ అభ్యర్థులు పెద్ద ఎత్తున ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నాగర్‌కర్నూల్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి చొరవ చూపి అనేక చోట్ల తన నియోజకవర్గంలో సర్పంచులను ఎంపిక చేసి కాంగ్రెస్‌కు దీటుగా పోటీలో నిలబెడుతున్నా రు. అనేక చోట్ల కూడా క్యాండిడేట్లను చూసి మిగతా పార్టీ వాళ్లు పోటీ చేయడానికి కూడా వెనుకాడే పరిస్థితి నెలకొంది. అలంపూర్ నియోజకవర్గంలో కూడా అధికార పార్టీకి షాక్ ఇచ్చిన బీఆర్ఎస్కు చెందిన ముగ్గురు సర్పంచులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పుంజుకోవడంతో కాంగ్రెస్ పార్టీ నేతలు కలవరపడుతున్నారు.
ప్రచారంలో దూసుకుపోతున్న అభ్యర్థులు
తొలి విడుత ఎన్నికల సమరం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రారంభమైంది. గురువారం అనేకచోట్ల అభ్యర్థులు ఇంటింటి ప్రచారాన్ని ప్రారంభించారు. కేటాయించిన గుర్తులను ఓటర్లకు చూయించి ఎన్నికల్లో తమకే ఓటు వేయాలని ప్రాధేయపడుతున్నారు. అంతేకాకుండా వార్డు సభ్యులను కూడా ప్యానల్‌గా మార్చుకొని ప్రచారం ప్రారంభించారు. గ్రామాల్లో అప్పుడే ఎన్నికల ప్రచారం మొదలు కావడంతో సందడిగా మారింది. ఈనెల 11న తొలి విడుత ఎన్నికలు జరుగుతున్నాయి. ఇంకా వారం రోజులే సమయం ఉండడంతో అభ్యర్థులు జోరుగా ప్రచారాన్ని ప్రారంభించారు.
అధికార పార్టీకి చుక్కలు చూపుతున్న బీఆర్ఎస్
రాష్ట్రంలో అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ పంచాయతీ ఎన్నికల్లో గట్టి పోటీని ఇస్తున్నది. అనేకచోట్ల పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అధికార పార్టీ నుంచి నిరాసక్తత వ్యక్తం చేయడంతో కాంగ్రెస్ పార్టీ నేతలు ఖంగు తింటున్నారు. దీంతో బీఆర్ఎస్ నుంచి పోటీకి చాలామంది ఆసక్తి చూపుతున్నారు. బీఆర్ఎస్ పార్టీలో ఆశావాహుల సంఖ్య ఎక్కువ కావడంతో మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు క్యాండిడేట్ల ఎంపికలు గ్రామ పార్టీ నాయకులకే వదిలి పెట్టారు. దీంతో చాలా గ్రామాల్లో నాయకులంతా కూర్చొని అధికార పార్టీని ఓడించడమే ధ్యేయంగా అభ్యర్థులను ఎన్నుకుంటున్నారు. ఫలితంగా అన్ని గ్రామ పంచాయతీల్లో నువ్వా నేనా అనే రీతిలో పోటీలు జరిగే అవకాశాలున్నాయి. అనేకచోట్ల బీఆర్ఎస్ అభ్యర్థుల నామినేషన్లకు భారీ ఎత్తున జనం హాజరుకావడం ఇందుకు నిదర్శనం. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను పంచాయతీ ఎన్నికల్లో ఎక్కడికక్కడ నిలదీస్తున్నారు. దీనివల్ల అనేక గ్రామాల్లో అధికార పార్టీ అభ్యర్థులకు చుక్కలు కనబడుతున్నాయి.
ఉమ్మడి జిల్లాలో మొదటి విడుతలో ఏకగ్రీవంగా ఎన్నికైన బీఆర్ఎస్ సర్పంచులు
వనపర్తి నియోజకవర్గం :
శాంతి, కర్నె తండా, గణపురం మండలం చంద్రమ్మ, కోతులకుంట తండా, ఘనపురం మండలం కవిత, ఆముదాల కుంట తండా, గోపాల్పేట మండలం బంగారయ్య, లక్ష్మీదేవిపల్లి, గోపాల్పేట మండలం
అలంపూర్ నియోజకవర్గం :
ఉప్పరి వెంకటేశ్, జక్కిరెడ్డిపల్లె, వడ్డేపల్లి మండలం జ్యోత్స్న, కొంకల గ్రామం
నారాయణపేట నియోజకవర్గం :
దామరగిద్ద మండలం బాపన్ పల్లి గావినోళ్ల శ్రీనివాస్
నాగర్‌కర్నూల్ నియోజకవర్గం :
పెద్దింటి కవిత అర్జున్, ఎటిధర్పల్లి, తాడూరు మండలం పాత్లావత్ శాలి, రాంరెడ్డిపల్లి, బిజినపల్లి మండలం
జడ్చర్ల నియోజకవర్గం :
బాలరాజ్, పల్లెగడ్డ, నవాబ్‌పేట మండలం సబావట్ గీత, మోత్కులకుంట, రాజాపూర్ మండలం చందర్, కల్లెపల్లి, రాజాపూర్ మండలం
ఏం సాధించారని ఓట్లు వేయాలి?
గ్రామపంచాయతీ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడం.. ఆరు గ్యారెంటీలను ఇస్తామని చెప్పి మోసం చేసినందుకు ఓటేయాలా..? బీసీలకు 42 శాతం చట్టబద్ధంగా రిజర్వేషన్ కల్పిస్తామని హామీ ఇచ్చి 18 శాతం సీట్లు కేటాయించనందుకు ఓట్లు వేయాలా..?. ముఖ్యంగా మహిళలకు నెలకు రూ.2500 నగదు ఇస్తామని మోసం చేసినందుకా..? కల్యాణలక్ష్మితోపాటు తులం బంగారం ఇస్తామని చెప్పి మోసం చేసినందుకా..? దివ్యాంగులు, వృద్ధులకు పింఛన్లు డబుల్ చేస్తామని చెప్పి మోసం చేసినందుకు ఓటు వేయాలా.. అసలు కాంగ్రెస్ వారికి ఎందుకు ఓటు వేయాలో ప్రజలు తేల్చుకోవాలి. రాష్ర్టాన్ని దివాళి తీసి అప్పుల పాలు చేసి గ్రామపంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తే కేంద్రం విడుదల చేసిన అభివృద్ధి నిధులు రూ.3200 కోట్లు దిగమింగడానికి రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు వెళ్తుందని… ఈ నిధులన్నీ పక్కదారి పట్టించి గ్రామాలను పంచాయతీలను భ్రష్టు పట్టించేందుకు ప్రణాళిక రెడీ చేశారు. అందుకే ప్రజలు విచక్షణతో ఓటు వేయాలి. లేకపోతే భవిష్యత్ తరాలకు కష్టం.
– శ్రీనివాస్‌గౌడ్, మాజీ మంత్రి, మహబూబ్‌నగర్