నాగర్‌కర్నూల్, జూన్ 5 (నమస్తే తెలంగాణ) : ఎన్నికల కోడ్ గురువారంతో ముగియనున్నది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎన్నికల కోడ్ అభివృద్ధికి అడ్డుగా మారింది. దీంతో ప ల్లెలు, పురపాలికల్లో ఎక్కడి సమస్యలు అక్కడే పేరుకుపోగా.. గ్రామాల్లో ప్రత్యేకాధికారుల పాలన మొక్కుబడిగా సాగుతున్నది. ఎట్టకేలకు పార్లమెంట్ ఎన్నికల కోడ్ ముగుస్తుండడంతో ఇకనైనా అభివృద్ధి పట్టాలెక్కుతుందన్న ఆశతో ప్రజలు ఎదురుచూస్తున్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వంలో అభివృద్ధిని ఆశించిన ప్రజల కు ఎండమావిగానే మారింది. అలవి కాని హామీలతో అధికారంలోకి వచ్చిన హస్తం పార్టీ ప్రజల కనీస అవసరాలను తీర్చే దిశగా ముందుకు సాగడంలేదు. ప్రభు త్వం మారడంతో బీఆర్ఎస్ హయాంలో చేపట్టిన అభివృద్ధి పనులు నిలిచిపోయాయి. పలు ప్రభుత్వ భవనా లు, ప్రాజెక్టులు, రోడ్ల నిర్మాణాలు మధ్యలోనే ఆగిపోయాయి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఈ పనులన్నీ పెండింగ్‌లోనే ఉన్నాయి. దీనికితోడు పార్లమెంట్ ఎన్నికల కోడ్ గత మార్చి 16 నుంచి పరిస్థితిని మరింత దిగజార్చింది. సర్కారు ఎన్నికల కోడ్ సాకుతో ఓట్లు, సీట్లపైనే దృష్టి సారించడంతో ప్రజా సమస్యలు పెండింగ్‌లో పడిపోయాయి. దీంతో ప్రజల గోడు వినే పరిస్థితి లేకపోయింది. కలెక్టర్లు సహా మండల, గ్రామస్థాయి అధికారులు ఎన్నికల విధుల్లోనే ఉండడంతో ప్రజావాణి సైతం వాయిదా పడింది. ఫలితంగా వేలాదిమంది భూ, సంక్షేమ పథకాలు, గ్రామాల్లో పారిశు ధ్యం, తాగునీటి సమస్య, సాగునీటి ప్రాజెక్టుల నిర్వహ ణ, మరమ్మతులు, గ్రామాలు, పురపాలికలకు నిధుల విడుదల బంద్ అయ్యింది. ప్రజాప్రతినిధుల పర్యవేక్ష ణ, సమీక్షలు లేక అధికారులు కూడా పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. నిధుల లేమితో గ్రామాలు, పురపాలికలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. నియోజకవర్గాల్లో అభివృద్ధి కోసం ప్రభుత్వం రూ.10కోట్ల చొ ప్పున కేటాయిస్తున్నట్లు చెప్పినా.. నిధుల వినియోగంపై సందిగ్ధత నెలకొన్నది. ఎమ్మెల్యేలు రాజకీయాలు, ప్రైవే ట్ కార్యక్రమాలకే పరిమితమయ్యారు.
ఇక మనఊరు-మనబడి పనులు పడకేయగా.. కొత్తగా అమ్మ ఆదర్శ పాఠశాలల పేరిట ఈనెల 12వరకు చేపట్టాల్సిన మరమ్మతుల పనులు ప్రశ్నార్థకంగా మారాయి. గ్రామాలు, మున్సిపాలిటీల్లో అంగన్వాడీలు, స్కూళ్లు, సమీకృత మార్కెట్ సముదాయాలు, డ్రైనేజీలు, విద్యుద్దీపాలు, సీసీరోడ్లలాంటి నిర్మాణాలను నిధుల లేమి వెక్కిరిస్తోం ది. హరితహారం, వన నర్సరీలు, డంపింగ్ యార్డు, శ్మశానవాటికల నిర్వహణను గాలికొదిలేశారు. పల్లెల్లో ప్రత్యేకాధికారులను నియమించినా మొక్కుబడి పర్యవేక్షణకే పరిమితమవుతూ వచ్చారు. నిధులు లేక విధులకు దూరంగా ఉండేందుకే చూస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. పంచాయతీలకు రావాల్సిన ఆస్తిపన్ను ఆశించినస్థాయిలో వసూలు కాలేదు. సర్పంచులు లేకపోవడంతో పర్యవేక్షణ కరువై, అభివృద్ధి జరుగక ఆస్తిప న్ను చెల్లింపునకు ప్రజలు ముందుకు రాలేదు. ఈ పన్నులతో పాటు జీపీలకు స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్, 15వ ఆర్థిక సంఘం నిధులు రావాల్సి ఉంది. ఖర్చు చేయక మిగిలిన నిధులను మార్చిలోనే ప్రభుత్వం వెనక్కు తీసుకున్నది. ఇలా నిధులు లేక, అధికారుల పర్యవేక్షణ లేక, ఎన్నికల కోడ్‌తో అభివృద్ధికి పల్లెలు, పట్టణాలు ఆమడదూరంలో నిలిచిపోయాయి. ఇదిలా ఉంటే సర్పంచ్ ఎన్నికలు జరుగుతాయన్న ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వం జూన్‌లో ఎన్నికలు నిర్వహిస్తామని పేర్కొనడంతో ఆలోగా నిధులు మంజూరు కాకుంటే అ భివృద్ధి పనులు మళ్లీ నిలిచిపోయే అవకాశం ఉన్నది. ఏ దేమైనా ఎన్నికల కోడ్ ముగియనుండడంతో రాబోయే రోజుల్లోనైనా అభివృద్ధి గాడిన పడేనా అని ప్రజలు ఎదుతరు చూస్తున్నారు.